క్రైమ్/లీగల్

జగన్‌పై దాడి కేసులో తూ.గోలో కొనసాగిన సిట్ దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, అక్టోబర్ 27: విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడికి పాల్పడిన కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో వరుసగా రెండో రోజు శనివారం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు దర్యాప్తు నిర్వహించారు. విశాఖ నుండి వచ్చిన సిట్ ఎస్సై వెంకటరావు, ముమ్మిడివరం ఎస్సై బీ ప్రభాకరరావుతో కలిసి శనివారం ఉదయం పది గంటల సమయంలో శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ముందుగా విచారించారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు, కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఈ ఖాతాలకు ఎక్కడి నుండైనా పెద్ద మొత్తంలో నగదు జమ అయ్యిందా అనే కోణంలో కొద్దిసేపు విచారించినట్లు తెలిసింది. శుక్రవారం విచారణకు రాని శ్రీనివాసరావు సొంత అక్క దోనిపాటి లక్ష్మీదేవిని శనివారం విచారించారు. అలాగే శ్రీనివాసరావుకు ఉత్తరం రాసినట్లుగా చెపుతున్న జనిపల్లి విజయదుర్గ సోదరుడు జనిపల్లి రాజేష్‌ను, గ్రామంలోని అంగన్‌వాడీ టీచర్ బూల శమంతకమణిని శ్రీనివాసరావు ఇంటివద్దే విచారించి వారి వాగ్మూలాన్ని రికార్డుచేశారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ శ్రీనివాసరావు ఇంటి వద్ద వివిధ కోణాల్లో విచారణ నిర్వహించిన సిట్ ఎస్సై వెంకటరావు నాలుగు గంటలకు ముమ్మిడివరం స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉండే గ్రామానికి చెందిన మెల్లం శ్రీనివాసరావు, సామంతకుర్తి నాగరాజు, పాము నాగేశ్వరరావు, జనిపల్లి శివసుబ్రహ్మణ్యం, జనిపల్లి సతీష్, జనిపల్లి ఝాన్సీ లక్ష్మీ, ప్రసాదరావును ముమ్మిడివరం స్టేషన్‌కు రప్పించి పలు అంశాలపై వివరాలు సేకరించారు. కాగా, శ్రీనివాసరావు ఇంట్లో లభించిన మూడు బ్యాంకు ఖాతాలకు అజ్ఞాత వ్యక్తులు భారీ మొత్తంలో నగదు జమ చేసినట్లు అనుమానం రావడంతో వాటి వివరాలపై కూపీ లాగేందుకు సిట్ అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే శనివారం బ్యాంకులు సెలవుకావడంతో విచారణ ముందుకు సాగలేదు.

చిత్రం..శ్రీనివాసరావు బంధువులను విచారిస్తున్న సిట్ ఎస్సై వెంకటరావు