క్రైమ్/లీగల్

గుట్టుగా విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 27: వైసీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం కేసులో సిట్ అధికారులు విచారణ అత్యంత గుట్టుగా చేస్తున్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగి మూడు రోజులు గడుస్తుండగా, విచారణలో ఇప్పటి వరకూ ఎటువంటి పురోగతి కన్పించలేదు. అయితే హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్‌ను పలు విడతలుగా విచారించిన సిట్ పోలీసులు లేఖ రాసేందుకు సహకరించిన సహచరుడు రేవతిపతిని కూడా విచారిస్తున్నారు. నిందితుడు శ్రీనివాస్ సొంత గ్రామం నుంచి సోదరి విజయదుర్గ సహా మరి కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా ఎయిర్‌పోర్టులో రెస్టారెంట్ నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడు హర్షవర్ధన్‌ను సిట్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. శ్రీనివాస్ వ్యవహార శైలి సహా అతని ప్రవర్తనపై పలు అంశాలను ఆరా తీశారు. శ్రీనివాస్ ఎప్పుడు పనిలో చేరింది, తదితర అంశాలను యజమాని హర్ష నుంచి రాతపూర్వకంగా తీసుకున్నారు.
సుమారు గంట పాటు శనివారం హర్షను సిట్ అధికారులు విచారించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా శుక్రవారం పోలీసులు అరెస్టు చూపించిన ప్రధాన నిందితుడు శ్రీనివాసరావును కస్టోడియల్ విచారణకు తీసుకోవడానికి కోర్టులో శనివారం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి వచ్చే నెల రెండో తేదీ వరకు శ్రీనివాసరావును పోలీసు కస్టడీకి అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో సిట్ అధికారులు శ్రీనివాసరావును కోర్టు ద్వారా తిరిగి కస్టడీకి తీసుకున్నట్టు బోగట్టా. వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై శ్రీనివాసరావు దాడి వెనక ఏమైన కుట్ర ఉందా అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మధురవాడ ఏసీపీ నాగేశ్వరరావు నేతృత్వంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.