క్రైమ్/లీగల్

మరో వివాహం చేసుకున్నాడని భర్తపై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 2: తనకు తన భర్తకు పంచాయతీ కోర్టులో పోలీసుస్టేషన్‌లో నడుస్తుండగానే తన భర్త మరో మహిళను వివాహం చేసుకుని కాపురం చేస్తున్నాడని ఒక మహిళ మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది. ఆధారాల సేకరణ కోసం భర్త ఉంటున్న గదిలోకి వెళ్లడంతో పరస్పరం ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బాధితురాలు తెలిపిన ప్రకారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామానికి చెందిన అనితకు మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామానికి చెందిన రాగం సంతోష్ కుమార్‌తో 2011 సంవత్సరంలో వివాహమైంది. సంతోష్ మండలంలోని గుండ్లపోచంపల్లి గ్రామంలో కారోబార్‌గా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో సంతోష్ కుమార్‌కు 18 తులాల బంగారు ఆభరణాలు, పల్సర్ బైక్‌తో పాటు లక్ష 50వేల రూపాయల నగదు కట్నం, ఇతర సామాన్లు ఇచ్చారు. పెళ్లైన 2, 3 నెలల తర్వాత సంతోష్ కుమార్ అనితను అదనపు కట్నం కోసం మానసికంగా శారీరకంగా వేధించసాగాడు. 2012 సంవత్సరంలో అనిత ఆడపిల్లకు జన్మనిచ్చింది. భర్త సంతోష్‌కుమార్‌తో పాటు అత్తమామలు.. అనితను ఆడపిల్ల పుట్టిందనే సాకుతో వేధిస్తూ రూ. 20లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని అన్ని విధాలుగా వేధించసాగారు. 2015 సంవత్సరంలో సంతోష్‌కుమార్ అనితను పుట్టింటి వద్ద వదిలేశాడు. న్యాయం కోసం అనిత కోర్టును ఆశ్రయించింది. తన భర్త వేరే మహిళను వివాహం చేసుకున్నాడని తనకు న్యాయం చేయాలని పోలీసులను సైతం కోరింది. దీంతో మేడ్చల్ పోలీసులు తమకు వివాహం చేసుకున్నట్లు ఏదైనా ఆధారం కావాలని అనితకు సూచించారు. పోలీసుల సూచనల మేరకు ఆధారం కోసం అనిత గురువారం రాత్రి తన తల్లితండ్రి, చెల్లెలు, తమ్ముడుతో కలిసి బాసురేగడిలో ఉంటున్న సంతోష్ కుమార్ గదికి వెళ్లి తలుపు కొట్టింది. సంతోష్ తలుపుతీయగానే లోపలికి వెళ్లిన అనిత గదిలో మరో మహిళ కూడా ఉండటం గమనించింది. ఈ మహిళ ఎవరని సంతోష్‌కుమార్‌ని నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. తన భర్తవైపు బంధువులు దాడి చేసి చితకబాదారని ఆవేదనను వెలిబుచ్చింది.
విషయమై ఎస్‌ఐ కొల్లు నాయుడును వివరణ కోరగా ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అనిత బంధువులు తనపై దాడి చేశారని రాగం సంతోష్ కుమార్, తన భర్త రెండో వివాహం చేసుకున్నాడని అనిత ఇచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.