క్రైమ్/లీగల్

ఒంగోలు రిమ్స్ కేసులను ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 2: ఇటీవల ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ క్వార్టర్స్‌లోని ఐదు ఇళ్లల్లో జరిగిన దొంగతనం కేసులను ఒంగోలు పోలీసులు ఛేదించినట్లు ఎస్‌పి సత్య ఏసుబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఎస్‌పి సత్య ఏసుబాబు మాట్లాడుతూ ఈ కేసుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు గజ దొంగలను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దార్ జిల్లా తాండా మండలం, కనిఅంబా గ్రామానికి చెందిన బేల్దారి మేస్ర్తీ కడక్‌సింగ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దార్ జిల్లా తాండామండలం, పిప్రాణి గ్రామానికి చెందిన సోను అలియాస్ సాను, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దార్ జిల్లా తాండామండలం, కాటి గ్రామానికి చెందిన దయాసింగ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్ జిల్లా, భాగ్లీ మండలం, అక్బర్‌పూర్ గ్రామానికి చెందిన జీవన్‌చౌహాన్ అనే నలుగురు దొంగలను పోలీసులకు అందిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఒంగోలులోని సౌత్ బైపాస్ సమీపంలో ఒంగోలు పట్టణ డిఎస్‌పి బి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఒంగోలు వన్‌టౌన్ పోలీసు స్టేషన్ సిఐ ఫిరోజ్, ఎస్‌ఐలు నాయబ్ రసూల్, మస్తాన్‌వలి, ఎఎస్‌ఐ బాబురావు, హెడ్ కానిస్టేబుల్ మస్తాన్‌రెడ్డి, పిసిలు అహ్మద్‌బాషా, రమేష్, విఘ్నేష్, ఆలి, నాగరాజు, ఆనంద్, కిరణ్, సురేష్, చలపతి, ఐటి కోర్ సిబ్బంది కలిసి అరెస్ట్ చేసినట్లు ఎస్‌పి తెలిపారు. ఈ కేసుల వివరాలను ఎస్‌పి వివరిస్తూ ఈ ఏడాది జనవరి 24న ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ క్వార్టర్స్‌లో వరుసగా ఐదు ఇళ్లల్లో దొంగతనాలు జరిగినట్లు ఎస్‌పి తెలిపారు. ఈ దొంగతనం కేసుల్లో ప్రజల్లో నెలకొన్న భయభ్రాంతులను తొలగించేందుకు తన స్వీయ పర్యవేక్షణలోప్రతిష్టాత్మకంగా తీసుకుని తాను నిరంతరం తన సిబ్బందితో సమీక్షిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ దొంగతనాలను మధ్యప్రదేశ్ గ్యాంగ్ చేసివుంటారని అనుమానించి వారిని పట్టుకునేందుకు ఒంగోలు పట్టణ డిఎస్‌పి బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్ సిఐ ఫిరోజ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు ఎస్‌పి తెలిపారు. దొంగలు నేరం చేసిన విధానం గురించి ఎస్‌పి తెలిజేస్తూ ఈ ఏడాది జనవరి 23న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కడక్‌సింగ్, మరో ముగ్గురు దొంగలు కలిసి మధ్యప్రదేశ్ నుండి లారీల్లో ఒంగోలుకు వచ్చినట్లు తెలిపారు. ఆ తరువాత వారు ఒంగోలులో హైవేలో దిగి ఒంగోలులోని చాలా ప్రదేశాలలో రిక్కీ నిర్వహించి మరుసటి రోజు అయిన 24న ఒంగోలు నగరంలోని రిమ్స్ హాస్పటల్ క్వార్టర్స్‌లో అర్ధరాత్రి సమయంలో వెనుక గోడ ద్వారా దూకి ఇంటికి తాళం వేసి ఉన్న గృహాలను ఎంచుకుని మిగిలిన గృహాలకు బయటనుంచి ఘడియలు పెట్టి దొంగతనం చేసి మరలా లారీల్లో మధ్యప్రదేశ్‌కు వారు చేరుకోవడం జరిగిందని ఎస్‌పి తెలిపారు. ఈ దొంగలను తమ పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా ఒంగోలు టౌన్ పరిధిలో ఆరు కేసులు, హైదరాబాద్‌లో 11 కేసులు కలిపి మొత్తం 17 ఇంటి దొంగతనాల కేసులు వీరిపై ఉన్నట్లు తేలిందన్నారు. ఈ ఏడాది 24న రాత్రి ఒంగోలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆరు ఇళ్లల్లోనూ, 2015-16 సంవత్సరాలలో హైదరాబాద్‌లోని కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో ఏడు ఇళ్లల్లోనూ, 2015 సంవత్సరంలో హైదరాబాద్‌లోని హిమయత్ నగర్, మీర్‌పేట,బోయనపల్లి, బాచుపల్లి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో 4 ఇళ్లలోవీరు దొంగతనాలు చేసినట్లు గా ఒప్పుకోవడం జరిగిందని ఎస్‌పి తెలిపారు. 2015 సంవత్సరం నుండి పలు రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ దొంగతనాలు చేసినప్పటికీ ఇంతవరకు ఏ పోలీసులు వీరిని అరెస్ట్ చేయలేదని ఎస్‌పి తెలిపారు. ఎక్కడో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రిమినల్ గ్యాంగ్‌ని అనుమానించి ఈ దొంగలను పోలీసులు పట్టుకోవడం అభినందనీయమన్నారు. ఈ దొంగలను చాకచక్యంగా అరెస్ట్‌చేసిన పోలీసు సిబ్బందిని ఎస్‌పి ప్రత్యేకంగా అభినందించడంతోపాటు వారికి రివార్డ్‌లను అందజేశారు.