క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లురూరల్, మార్చి 2 : మండలంలోని నక్కనదొడ్డి గ్రామ సమీపంలో ఉన్న దర్గా వద్ద శుక్రవారం వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. నక్కనదొడ్డి దర్గా సమీపంలో రోడ్డు మార్గంలో వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తిని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన స్థానికులు 108 వాహనానికి ద్వారా వైద్యం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
చింతచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
అమరాపురం, మార్చి 2 : మండల పరిధిలోని నిద్రగట్ట గ్రామ సమీపంలో ఎర్రగుంటప్ప (67) చింతకాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి శుక్రవారం మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌ఓ మల్లేష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే నిద్రగట్టకు చెందిన ఎర్రగుంటప్ప చింతచెట్ల నుంచి కాయలు దులుపుతుండగా కాలుజారి కిందపడ్డాడు. గాయాలకు గురైన బాధితుడిని సమీపంలోని కరిదాసనహళ్లికి తీసుకెళ్లి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించగా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య మారెక్క ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.