క్రైమ్/లీగల్

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్వశ్రీరాంపూర్, మార్చి 2: పరీక్షలో ఫెయిల్ అవుతానేమోననే బెంగతో ఇంటర్ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆరెపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆరెపల్లి గ్రామానికి చెందిన గీరం సాగరిక (18) మండలంలోని మల్యాల మోడల్ స్కూళ్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. బుధవారం జరిగిన తెలుగు పరీక్షలో తాను ఉత్తీర్ణత సాధించలేకపోతానేమోననే బెంగతో తన ఇంటి సమీపంలో గల వ్యవసాయ బావిలో గురువారం రాత్రి దూకి మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసేసరికి సాగరిక కనిపించకపోవడంతో ఇంటి సమీపాన గల వ్యవసాయ బావి వద్ద సాగరిక చెప్పులు కనిపించడంతో బావిలో చూసేసరికి సాగరిక మృతి చెంది ఉంది. కాగా, సాగరిక స్నేహితులు, పాఠశాల ఉపాధ్యాయులు ఆరెపల్లికి చేరుకొని సాగరిక ఎంతో ధైర్యవంతురాలని, చదువులో ముందుండేదని బోరున విలపించారు