క్రైమ్/లీగల్

రాంరావుపల్లిలో వ్యక్తి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, మార్చి 2: చందుర్తి మండలం రాంరావుపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి లింగయ్య (50) అనే వ్యక్తిని ఇదే గ్రామానికి చెందిన లింగంపల్లి రాజయ్య అతని కుమారుడు వెంకటేష్‌తో పాటు మరికొందరు శుక్రవారం రాత్రి కర్రలు, గొడ్డలితో దాడి చేయగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. లింగయ్య కుమారుడు అనిల్ ఇదే గ్రామానికి చెందిన రాజయ్య కూతురును సంవత్సరం క్రితం ప్రేమ పెళ్లి చేసుకోగా అప్పటి నుండి రెండు కుటుంబాల మధ్య విబేధాలు తీవ్రమయ్యాయి. హోలీ పండుగ రోజు లింగయ్య కుటుంబ సభ్యులు హోలీ ఆడేందుకు వెళ్లగా ఇంటిలో ఒంటరిగా ఉన్న లింగయ్యపై రాజయ్య, వెంకటేష్‌తో పాటు మరి కొందరు తీవ్రంగా దాడి చేయగా తీవ్ర రక్తస్రావం కావడంతో వేములవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చందుర్తి సిఐ విజయ్ కుమార్, ఎస్‌ఐ మల్లేశం గౌడ్‌లు హత్య జరిగిన వివరాలను తెలుసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ప్రేమ పెళ్లి వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.

గోపాలరావుపేటలో టాస్క్ఫోర్స్ దాడులు
రామడుగు, మార్చి 2: గోపాలరావుపేట గ్రామంలో కరీంనగర్ టాస్క్ఫోర్స్ శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు సెల్ పాయింట్లపై దాడులు నిర్వహించి బ్లూ ఫిలిం, ఫైరసీ సినిమాలు స్వాదీనం చేసుకొని నలుగురిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా అక్రమంగా గ్యాస్ రీఫీలింగ్ చేస్తున్న సెంటర్‌పై దాడి చేసి 14 సిలిండర్లు, పేయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పెద్ది లచ్చయ్య వద్ద నుండి అక్రమంగా నిలువ ఉంచిన 50 లీటర్ల కిరోసిన్, రెండు క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు.

మొసలిని పట్టుకున్న ఫారెస్టు అధికారులు
మల్లాపూర్, మార్చి 2: మండలంలోని పాతదాంరాజ్‌పల్లి గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువులోని వ్యవసాయ బావిలో శుక్రవారం మొసలిని ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. ఫారెస్టు అధికారుల కథనం ప్రకారం ఒ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యేక్షం కావడంతో అటువైపు వెళ్తున్న స్థానికులు గమనించి ఫారెస్టు అధికారులు సమాచారం అందించగా వెంటనే ఫారెస్టు అధికారులు సిబ్బంది ద్వారా అక్కడికి చేరుకుని వలల సహాయంలో మొసలిని పట్టుకుని సురక్షిత ప్రాంతమైన గోదావరి నదిలో వదిలిపెట్టారు. సెక్షన్ ఆఫీసర్ సాయి ప్రసాద్, బీట్ ఆఫీసర్ సరోజన, సర్పంచ్ గంగాధర్, రాజేందర్, సిబ్బంది ఉన్నారు.