క్రైమ్/లీగల్

దొంగతనం కేసులో ఆరుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, మార్చి 2: మంచిర్యాల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర్ మెటల్ స్టోర్స్‌లో 14 రోజుల క్రితం జరిగిన చోరీ కేసులో ఆరుగురు నిందితులను పట్టుకోని వారి నుంచి రూ. 2,02,130 తో పాటు మోటర్ సైకిల్‌ను స్వాధీన పరుచుకున్నట్లు గా పట్టణ సీ ఐ ఎడ్ల మహేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంగ తనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. భద్రాది ( కొత్తగూడెం ) జిల్లా రామవరంకు చెందిన గాజుల హారీష్, రామకృష్ణాపూర్ లో ఉండే అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అతనికి మంచిర్యాలకు చెందిన ముచ్చర్ల రవితేజతో పరిచయం ఏర్పడింది. వీరితో నలుగురు బాలలు కలిసి జల్సాల కోసం ఏదైనా చేయాలని ఆలోచించారు. దొంగతనం చేయాలని నిర్ణయించుకోని 14 రోజుల క్రితం మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ రోడ్డు లో ఉన్న శ్రీ వెంకటేశ్వర మెటల్ స్టోర్స్ షట్టర్‌ను రాత్రి వేళలో పగులకొట్టి షాపులో ఉన్న రూ. 1,50,000 ఎత్తుకెళ్లారు. మంచిర్యాల పోలీసులతో పాటు సీసీ ఎస్ పోలీసులు ఆధారాలను సేకరించి నిందితులను శుక్రవారం బస్టాండ్ ఏరియాలో తిరుగుతుండగా పట్టుకున్నారు. మరో నేరం చేసేందుకు సిద్దం అవుతుండగా పోలీసులు వల వేసి పట్టుకున్నారు. వారి నుంచి రూ. 1,02,130 లను, ఒక మోటర్ సైకిల్‌ను స్వాధీనం చేసుకోని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపడం జరుగుతుందని సి ఐ తెలిపారు.
ఎండా కాలంలో ప్రజల ఇండ్లకు తాళాలు వేసి ఊరికి వెళ్తుంటారని పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెళ్లిళ్లకు ఇతర ఊర్లకు వెళ్లే క్రమంలో ఇంట్లో విలువైన వస్తువులు, ముఖ్యంగా నగదు,నగలు, ఉంచకూడదని ఆయన తెలిపారు. విలువైన వాటిని బ్యాంకు లాకర్లలో దాచుకోవాలని సూచించారు. పిల్లల తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. చోరీ కేసులో పట్టుబడిన ఆరుగురిలో నలుగురు చిన్నపిల్లలు అని మిగిలిన ఇద్దరు కూడా కొంచెం పెద్ద వారు అని తెలిపారు. వీరు చదువుకునే వయస్సులో చెడు అలవాట్లకు పడి చెడిపోతుందన్నారు. పిల్లల పెంపకం సరిగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేంది కాదని ప్రతి పిల్లవాన్ని తల్లిదండ్రులు గమనించి ఉండాలని తెలిపారు. పిల్లలు ఏదైనా చెడు వ్యసానాలకు గానీ ముర్ఖులతో చెడు స్నేహాలు చేస్తే వెంటనే మందలించి సరైన మార్గంలో నడిచే విధంగా బుద్ది చెప్పాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్సై లు శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్వర్, ప్రభాకర్ రావు, గంగా రాజ్ గౌడ్, సీసీ ఎస్ హెడ్ కానిస్టేబుల్ నంద గోపాల్, సతీష్, రాము, తదితరులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనాలు ఢీ
*ఇద్దరికి గాయాలు
ఆదిలాబాద్ టౌన్,మార్చి 2: ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఎదురుగా శుక్రవారం జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో కైలాస్ అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా రాముకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానికులు హుటాహుటిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఇరువురు దనోర, దేవాపూర్ గ్రామానికి చెందిన వారని తెలిసింది.