క్రైమ్/లీగల్

విశాఖ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 2: కౌలాలంపూర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి వారు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం కౌలాలంపూర్ నుంచి ఈనెల ఒకటో తేదీన పల్లి శ్రీనివాసరావు విశాఖకు చేరుకున్నాడు. అతని బ్యాగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు శ్రీనివాసరావు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో, ఆయనతోపాటు తీసుకువచ్చిన సూట్‌కేస్‌ను పూర్తిగా తనిఖీ చేశారు. సూట్‌కేస్ ఫ్రేమ్‌లో బంగారు తీగలను అమర్చాడు. అంతేకాకుండా లెక్కకు మించి బంగారు బ్రాస్‌లెట్‌లను కూడా ఆయన తీసుకువచ్చాడు. ఇతని వద్ద నుంచి 365.50 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 11,67,800 రూపాయలుగా పేర్కొన్నారు. అలాగే, గత నెల 20న కౌలాలంపూర్ నుంచి ఎం.అద్దురహమాన్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతని వద్ద లభించిన రీచార్జ్‌బుల్ ఎమర్జన్సీ లైట్‌ను కస్టమ్స్ అధికారులు స్కాన్ చేసి చూడగా 250 గ్రాముల బరువుగల రెండు బంగారు కడ్డీలను గుర్తించారు.