క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామిడి, మార్చి 1 : మండల పరిదిలోని సొరకాయలపేటలో బుధవారం అర్ధరాత్రి రాజశేఖర్ (25) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తన సోదురుడు మునీంద్ర కుమారుడు తరుణ్ గార్లదినె్న అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతుండగా సంక్రాంతి పండుగకు సెలవులు ఇవ్వటంతో గతనెల 14న రాజశేఖర్ ద్విచక్రవాహనంలో తరుణ్‌ను స్వగ్రామానికి తీసుకెళ్తుండగా పెట్రోల్ బంక్ వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో తరుణ్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తరుణ్ మృతికి కారణమయ్యానంటూ రాజశేఖర్ మనోవేదనతో సతమతమవుతుండేవాడు. ఇందులో భాగంగానే రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. గమణించిన బంధువులు అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు.
యువకుడి అనుమానాస్పద మృతి
ఆత్మకూరు, మార్చి 1: మండల పరిధిలోని ఆత్మకూరు-వై.కొత్తపల్లి మధ్య ప్రధాన రహదారి సమీపంలో బెళుగుప్ప మండలం కాలువపల్లి తండాకు చెందిన అశోక్ కుమార్‌నాయక్ (23) అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. అశోక్‌కుమార్‌నాయక్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో భాగంగానే బుధవారం సాయంత్రం ఇసుక ట్రాకర్‌తో అనంతపురం వెళ్తుండగా మితిమీరిన వేగంతో వచ్చి అదుపుతప్పి నల్లకట్టువ వద్ద పొలాల్లోకి దూసుకుపోయింది. దీంతో ప్రమాదవశాత్తు మృతి చెంది ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడు చదునుగా ఉన్న నేలపై పడి ఉండి, దాదాపు కిలోమీటర్ దూరంలో ట్రాక్టర్ ఉండటం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న ఎస్సై సాగర్ సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హోలీ పండుగ సమయంలో అశోక్‌కుమార్‌నాయక్ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. శవాన్ని పోస్టుమార్టం తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.