క్రైమ్/లీగల్

డివైడర్‌ను ఢీకొట్టిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఫిబ్రవరి 28: అతివేగంతో ప్రయాణిస్తున్న ఓ బెంజి కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందగా కారుకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధం అయిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధి అవుటర్ రోడ్డుపై బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధి యంనంపేట్ సమీపంలోని అవుటర్ రింగ్‌రోడ్డుపై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన వెగశ్న శ్రీరామరాజు(31) తన బెంజికారు (ఏపీ37 సిఎఫ్ 6777)లో వేగంగా ప్రయాణిస్తుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు మూడు పల్టీలు కొట్టడంతో నిప్పంటుకుంది. అది గమనించిన ఇతర వాహనదారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలకు గురైన శ్రీరామరాజును చికిత్స నిమిత్తం నగరంలోని తులసి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నిప్పంటుకున్న కారును ఫైర్ ఇంజన్‌ను రప్పించి మంటలు అర్పివేశారు. కారు అప్పటీకే పూర్తిగా ధ్వంసం అయినట్లు చెప్పారు.