క్రైమ్/లీగల్

పాత వాహనాల గోల్‌మాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: పాత వాహనాల రికార్డులు తారుమారు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను నగర టాస్క్ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. వారి నుంచి 15 రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సిసి మోటార్ సైకిళ్లు, రెండు యమహా 350 సిసి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డిసిపి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులు యు.హిటేష్ పటేల్, మిఖాల్ మోది, ఎ.విఠల్‌రావు, హకీం అబు నాసర్, మహ్మద్ ఆరిఫ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు పాత వాహనాల ఛాసిస్ నెంబర్, ఇంజన్ నెంబర్లను కొనడం గానీ లేదా టాంపరింగ్ చేయడం ద్వారా తిరిగి అదే పేరుతో కస్టమర్లకు విక్రయిస్తున్నారు. మోటార్ సైకిళ్ల రికార్డులను తారుమారు చేసి అక్రమంగా పాత వాహనాలను తిరిగి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ సెంట్రల్ జోన్ ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు బృందం విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుంది. నిందితులను, స్వాధీనం చేసుకున్న వాహనాలను బోయిన్‌పల్లి, గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు.

తృటిలో తప్పిన పెనుప్రమాదం
షాద్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 28: అతివేగంగా వచ్చిన కారు.. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బుధవారం ఉదయం 44వ జాతీయ రహదారి సమీపంలో కమ్మదనం నుంచి షాద్‌నగర్ వైపు వస్తున్న కారు.. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో మంటలు వ్యాపించి దగ్ధమైంది. కారు డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. దాంతో తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. కొద్దిసేపు రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.