క్రైమ్/లీగల్

ఫోన్ మాట్లాడుతూ పట్టుబడ్డఏడుగురికి శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, ఫిబ్రవరి 28: వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డ ఏడుగురు వాహనదారులకు న్యాయస్థానం రెండు రోజులపాటు జైలు శిక్ష విధించినట్లు టోలీచౌకి ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ పూసపాటి శివచంద్ర తెలిపారు. నాలుగు రోజులుగా టోలీచౌకి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలను నడిపే వారిపై కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన వారిని 12వ మెట్రోపాలిటన్ కోర్డు న్యాయమూర్తి సమ్మయ్యచారి ముందు హాజరుపర్చగా ఏడుగురికి రెండు రోజులపాటు జైలు శిక్ష విధించినట్లు సిఐ తెలిపారు. నల్లగుట్టకు చెందిన సయ్యద్ ఇమ్తియాజ్, ఆస్మాన్‌గడ్‌కు చెందిన సుల్తాన్, పద్మశాలిభవన్‌కు చెందిన నిరంజన్‌రెడ్డి, మహబుబ్‌నగర్‌కు చెందిన రాజు, రమేష్, టోలిచౌకి ప్రాంతానికి చెందిన యూనుస్ పాషా, జార్ఖండ్‌కు చెందిన విజయయాదవ్‌ను జైలుకు తరలించినట్లు ఇన్స్‌పెక్టర్ తెలిపారు.