క్రైమ్/లీగల్

ఓఎంఆర్ షీట్ల పరిశీలనకు న్యాయవాదుల కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూప్-2 పరీక్షల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఐదు వేల మంది మెరిట్ అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను తనిఖీ చేసేందుకు ముగ్గురు న్యాయవాదులతో కూడిన అడ్వకేట్ కమిషన్‌ను హైకోర్టు ఏర్పాటు చేసింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావు ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. గ్రూప్-2 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ వచ్చిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పై నిర్ణయాన్ని తీసుకుంది. ఓఎంఆర్ షీట్లను పరిశీలించిన తర్వాత వెంటనే నివేదిక ఇవ్వాలని అడ్వకేట్స్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్ రెడ్డి పబ్లిక్ సర్వీసు కమిషన్ తరఫున వాదనలు వినిపించారు.
అడ్వకేట్ కమిషన్‌కు ఓఎంఆర్ షీట్లను తనిఖీ చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచాలని హైకోర్టు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను మార్చి 19వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.