క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ జేఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, ఫిబ్రవరి 5: విశాఖ జిల్లా చోడవరం నీటిపారుదల శాఖ అధికారి లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కారు. సాగునీటి పారుదల శాఖ వడ్డాది విభాగంలో జేఈగా పనిచేస్తున్న ఆకుల ప్రకాష్‌ను సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకోగా, ఈ వ్యవహారంలో అతనికి సహాయకుడు ప్రసాద్ కూడా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం వడ్డాది సెక్షన్ పరిధిలోని కేజేపురంలో సీతారామ్‌సాగర్, రంగరాయసాగర్, శ్రీరామ్‌సాగర్ చెరువుల్లో పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఈ పనులు నీటి సంఘం అధ్యక్షుడి కుమారుడు ఆళ్ల సంతోష్ కాంట్రాక్ట్ తీసుకుని చేయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 24 లక్షలకు బిల్లులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ మొత్తంలో కొత్త మొత్తం బిల్లుకాగా, మరొక బిల్లు చేయాల్సి ఉంది. ఈ చివరి బిల్లు మంజూరు చేయడానికి జేఈ ఆకుల ప్రకాష్ 50 వేలు లంచం డిమాండ్ చేసారు. అంత మొత్తం ఇచ్చుకోలేనని కాంట్రాక్టర్ సంతోష్ చెప్పినప్పటికీ జేఈ అంగీకరించకపోవడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సోమవారం చోడవరం సెక్షన్ కార్యాలయంలో నగదు ఇవ్వగా జేఈ తన సహాయకుడు ప్రసాద్ చేతికి అందజేయాలన్నారు. అతనికి నగదు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.