క్రైమ్/లీగల్

ఐటీ నోటీసులు సబబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి తమ పన్ను రీ అసెస్‌మెంట్ కోరుతూ ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ చేసిన విజ్ఞప్తులను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే రీ అసెస్‌మెంట్‌పై కాంగ్రెస్ నేత అస్కార్ ఫెర్నాండెజ్ వేసిన పిటిషన్‌ను సైతం బెంచ్ కొట్టివేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2011-12 ఆదాయపు పన్నుకు సంబంధించి తాము సమర్పించిన పన్ను రిటర్న్‌ల రీ అసెస్‌మెంట్‌ను ఆ శాఖ చేపట్టడాన్ని ప్రశ్నిస్తూ రాహుల్, సోనియా గాంధీ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌లు ఎస్.రవీంద్రభట్, ఎకే చావ్లా ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. 2011-12 సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లలో కొన్ని ముఖ్యమైన విషయాలను దాచారని, వాటిని రీ అసెస్‌మెంట్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న నిర్ణయంపై ఈ ముగ్గురు నేతలు వేసిన పిటిషన్‌పై తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదాయపు పన్ను శాఖను ఆగస్టు 16న కోర్టు ఆదేశించింది. అయితే ఇన్‌కమ్‌టాక్స్ శాఖ చేపట్టిన రీ అసెస్‌మెంట్ నిర్ణయాన్ని నిలిపివేయాలని వారు చేసిన విజ్ఞప్తిని సోమవారం తోసిపుచ్చింది. పన్ను ప్రక్రియకు సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే ఆ శాఖతోనే తేల్చుకోవాలని కోర్టు సూచించింది. ఈ కేసులో రాహుల్ సోనియా తరఫున వాదించిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించిన విధంగా తమ క్లయింట్‌లు పన్ను నిబంధనలకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని అన్నారు.