క్రైమ్/లీగల్

ఆస్తికోసం తమ్మున్ని కడతేర్చిన అన్న..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, సెప్టెంబర్ 7: కేసముద్రం మండలం మహమూద్‌పట్నం కాలనీతండాలో గత నెల 28న అనుమానస్పద స్ధితిలో ఇంటర్మీడియట్ విద్యార్థి వాంకుడోత్ నవీన్ మృతి చెందిన ఘటన కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం నవీన్‌ను తోడబుట్టిన అన్న వాంకుడోత్ సంతోష్ తన స్నేహితు డు సిలివేరు సాయిరాం సహాకారంతో గొంతు నులి మి హత్య చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ నరేష్‌కుమార్ తెలిపారు. డీఎస్పీ కథనం ప్రకారం.. కాలనీతండాకు చెందిన వాంకుడోత్ శ్రీను, జీజా దంపతులకు సంతోష్, నవీన్ ఇద్దరు కుమారులు. సంతోష్ డిగ్రీ చదువుతుండగా, నవీన్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇద్దరు కూడా వరంగల్ నగరంలో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ యువతితో సంతోష్ ప్రేమలో పడ్డాడు. సంతోష్ ప్రేమిస్తున్న యువతి తండ్రి సంతోష్‌కు ఫోన్ చేసి నీకు ప్రభుత్వ ఉద్యోగం లేదు.. ఐదెకరాల భూమి లేదు.. మా బిడ్డను నీకు ఎలా ఇచ్చి పెండ్లి చేయాలంటూ ప్రశ్నించాడన్నారు. రెండింట్లో ఏదైనా ఒకటి సాధించు.. మా బిడ్డను ఇచ్చి పెండ్లి చేస్తానన్నాడన్నారు. దీనితో సంతోష్ తమకున్న ఐదెకరాల భూమి కోసం ఈ నెల 27 సోదరుడి హత్య కు పథకం వేశాడన్నారు. చాలా కాలంగా ఇద్దరు సోదరులు కూడా కలిసి మద్యం సేవించడం అలవాటుగా మారడంతో మద్యంలో పురుగుల మందు కలిపి తాగించి హత్య చేయాలని పథకం వేసి తండాకు సమీపంలోని బోడుపైకి తీసుకెళ్లి తాగించారన్నారు. బీర్లు తాగిన తరువాత వోడ్కా కూడా తాగించి, అనుమానం రాకుండా స్వీటు తినిపించారన్నారు. అయితే అప్పటికీ నవీన్ మృతిచెందకపోవడంతో నవీన్ షర్ట్ తొలగించి అదే షర్ట్‌తో నవీన్‌ను మెడకు భిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారన్నారు. రాత్రి ఏమి ఏరగనట్టు ఇంటికి వచ్చి పడుకొన్నాడన్నారు. ఇంటికి వచ్చిన సంతోష్‌ను నవీన్ ఏడంటూ తల్లి ప్రశ్నించగా, వరంగల్ వెళ్లి ఉంటాడని చెప్పాడన్నారు. అనుమానం రాకుండా తాను కూడా వెతుకుతున్నట్లు నటించి, ఓ పిల్లవాడిని వెంటపెట్టుకొని బోడు వద్దకు వెళ్లి నవీన్ మృతి చెందిన ఘటనను చూపాడన్నారు. దీనితో తల్లితండ్రులు, తండావాసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి చదువుకోవడం ఇష్టలేక ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావించి పోలీసులకు అలాగే ఫిర్యాదు చేశారు. దీనితో నవీన్ మృతిపై మహబూబాబాద్ రూరల్ సిఐ లింగయ్య విచారణ చేపట్టగా, ఆత్మహత్య కాదని, హత్య చేసినట్లు ఆధారాలు లభించడంతో హత్య కేసుగా మార్చినట్లు డీఎస్పీ తెలిపారు. హత్య ఘటన తరువాత పరారీలో ఉన్న సంతోష్, సాయిరామ్ శుక్రవారం పోలీసులకు లొంగిపోవడంతో అదుపులోకి తీసుకొని విచారణ జరపగా హత్య చేసినట్లు అంగీకరించారన్నారు. ఈ మేరకు సంతోష్, సాయిరామ్‌లను అరెస్టు చేసి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.