క్రైమ్/లీగల్

మోటార్ వాహనాల దొంగ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), సెప్టెంబర్ 1: వరుస దొంగతనాలకు పాల్పడుతూ కనపడ్డ వాహనాలను దొంగిలిస్తూ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్న కరుడుగట్టిన దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గత కొంత కాలంగా జల్సాలకు అలవాటుపడి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పట్టుబడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోలవరం గ్రామపరిధిలోని బొంబాయి తండాకు చెందిన భూక్యా సుమన్ జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఆటోరిక్షాలు, మోటార్ సైకిళ్ళు అపహరిస్తూ అటు పోలీసులను ఇటు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాడు. త్రీటౌన్ ఇన్స్‌పెక్టర్ వెంకన్నబాబు, సబ్ ఇన్స్‌పెక్టర్ మహేష్ సిబ్బందితో కలిసి శనివారం తనిఖీలు నిర్వహిస్తుండగా ఎఫ్‌సిఐ గోడాం క్రాస్ రోడ్డు వద్ద సుమన్ అనుమాన స్పదంగా తారసపడగా పోలీసులు అధుపులోకి తీసుకున్నారు. సుమన్‌ను విచారించగా చేసిన దొంగతనాలను ఒప్పుకున్నాడు. ఈ మేరకు ఏసిపి గంటా వెంకట్రావు శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అపహరించిన ఆటోలలోని స్పేర్ పాట్స్ అమ్ముకునేవాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మహబూబాబాద్ నుండి ద్విచక్ర వాహనాలను అపహరించగా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో జైలుపాలయ్యాడు. ఆ తర్వాత జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ఇల్లందు, మహబూబాబాద్‌లలో ద్విచక్రవాహనాలను, ఆటోలను అపహరించాడు. పగటి దొంగతనాలకు పాల్పడుతూ వెండి ఆభరణాలు సైతం అపహరించాడు. 7.5లక్షల విలువగల 9 ద్విచక్ర వహనాలను, 2 ఆటో రిక్షాలను, 44వేల విలువ గల వెండి పట్టీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగను అదుపులోకి తీసుకోవడం పట్ల పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఈ విలేఖరుల సమావేశంలో సిఐలు రాజిరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.