క్రైమ్/లీగల్

సిద్దేశ్వర కోనలో మరో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవీబీపురం, సెప్టెంబర్ 1: కేవీబీపురం మండలంలోని సిద్దేశ్వరకోనలో మరో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు శనివారం మృతిచెందినట్లు కేవీబీపురం ఎస్‌ఐ నరేష్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన సమాచారం మేరకు చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఈశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం బీటెక్ సివిల్‌కోర్సు చదువుతున్న సిలంబరసన్ (18), విజయ్ ఆనంద్ (18) సిద్దేశ్వర కోన నీటివాగులో పడి మృతిచెందినట్లు ఆయన తెలిపారు. కాలేజీలో చదువుతున్న విద్యార్థులు 12 మంది 12 ద్విచక్ర వాహనాల్లో బయలుదేరి ఊత్తుకోటై, నాగలాపురం, పిచ్చాటూరు మీదుగా కేవీబీపురం మండలంలోని ఆరెకు చేరుకొని ఆరె నుంచి సిద్దేశ్వర కోనకు శనివారం మధ్యాహ్నం 1గంటకు చేరుకున్నారు. 12 ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసి సిద్దేశ్వరకోనలోకి ప్రవేశించి అనుమతిలేని 3వ కోన కన్యకల గుండంలోకి ఐదుగురు విద్యార్థులు ప్రవేశించారు. మిగతా విద్యార్థులు మొదటి రెండైన జంపింగ్ ఫాల్స్, స్విమ్మింగ్ ఫాల్స్‌లో స్నానం ఆచరిస్తున్నారు. మిగతా ఐదుగురు అనుమతిలేని 3వ కన్యకల గుండంలోకి ప్రవేశించి స్నానమాచరిస్తుండగా సిలంబరసన్, విజయ్ ఆనంద్‌లో ఈత రాని నేపథ్యంలో నీటిలోపడి మునిగిపోయారని, విద్యార్థులు ఎంత ప్రయత్నించినా వారిని కాపాడుకోలేక పోయారని ఎస్ ఐ తెలిపారు. టీఎన్ 10 బిఎ 6699, టీఎన్ 85 హెచ్ 5464 రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహనాలలో కోనకు చేరుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం వారు చదువుతున్న కాలేజీ యాజమాన్యానికి మృత్యువాత పడ్డ విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు ఎస్‌ఐ తెలిపారు. సిద్దేశ్వర కోనలో ఏడు ఫాల్స్ ఉన్నాయని, అందులో రెండింటికి మాత్రమే అనుమతిస్తామని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తెలిపారు. ఈసందర్భంగా ఆరె గ్రామస్థులు మాట్లాడుతూ అనుమతిలేని కన్యకల గుండంలోనికి ఎవరినీ ప్రవేశించనీయమని, పూర్వంలో దేవతలు స్నానమాచరించే గుండంగా భావించి ఎవరూ సాహసించి వెళ్లమని తెలిపారు. ఇటీవల కాలంలో విహార యాత్రీకులు అనుమతి తీసుకోకుండానే అన్ని గుండాలకూ ప్రవేశిస్తున్నారనీ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని గ్రామస్థులు తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా దాదాపు 20 మందికిపైగా విద్యార్థులే మరణించి ఉంటారని ఆరె గ్రామస్థులు తెలుపుతున్నారు. దీనికి తగ్గట్టు ఫారెస్ట్ అధికారులు తగుచర్యలు చేపట్టకపోవడమే ఇలాంటి వాటికి కారణమవుతున్నాయని వారు తెలిపారు. ఇకనైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టవలసి ఉన్నదని గ్రామస్థులు తెలుపుతున్నారు. మృత్యువాత పడ్డ విద్యార్థులను గజ ఈతగాళ్లు సాహసించి మృతులను వెలికితీయలేక వెనుదిరిగారు. మూడవ కన్యకల గుండం 40 నుంచి 45 అడుగుల లోతు ఉండటంతో ఆదివారం ప్రయత్నిస్తామని గజ ఈతగాళ్లు తెలిపారు. మిగిలిన 10 మంది విద్యార్థులను, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.