క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమందేపల్లి, సెప్టెంబర్ 1 : మండల పరిధిలోని కావేటి నాగేపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి భక్తర్ (62) మృతి చెందగా ఇద్దరు గాయాలకు గురయ్యారు. ఎఎస్సై తిరుపాల్‌నాయక్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హిందూపురం నుండి ద్విచక్ర వాహనంలో భక్తర్, బాబ్‌జాన్ గోరంట్లకు వెళుతుండగా కావేటి నాగేపల్లి వద్ద వాహనం అదుపు తప్పడంతో రెడ్డిచెర్వుపల్లికి చెందిన నిడిమామిడప్పను ఢీకొన్నారు. దీంతో ముగ్గురు కిందకు పడిపోయి తీవ్ర గాయాలకు గురయ్యారు. వీరిని 108 అంబులెన్స్‌లో హిందూపురం తరలించారు. అయితే చికిత్స పొందుతూ భక్తర్ మృతి చెందగా గాయపడ్డ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పాముకాటుకు వ్యక్తి మృతి
కుందుర్పి, సెప్టెంబర్ 1 : మండల పరిధిలోని బెస్తరపల్లి గ్రామానికి చెందిన రాజేష్ (50) గురువారం రాత్రి పాముకాటుకు గురై మృతి చెందాడు. ఇతను ప్రస్తుతం సింగల్ విండో డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. సొంత పనుల నిమిత్తం రాత్రి తన పొలంలోకి వెళ్లగా చీకటిలో పాముకాటుకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.