క్రైమ్/లీగల్

ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగాపూర్, ఆగస్టు 31: అందం గా ముస్తాబు చేసిన పెళ్లిపందిరి..మరి కాసేపట్లో వివాహం జరగాల్సిన తరుణం. వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చిన బంధువులు..ఇంతలోనే పెళ్లింట కలకలం రేగింది. వరుడు అరెస్టు అయ్యాడన్న సమాచారంతో వధువు ఇంట పెనువిషాధం నిండింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సారంగాపూర్ మండలంలోని లక్ష్మిదేవిపల్లి గ్రామానికి చెందిన సల్ల నర్సయ్య -అంజలి దంపతుల కుమా ర్తె వివాహం శుక్రవారం 10:35గంటలకు జరగాల్సి ఉంది. జగిత్యాల మండలంలోని పొరండ్ల గ్రామానికి చెందిన కొర్రి గంగారాం - భాగ్య దంపతుల తనయుడు వంశీకి ఇచ్చి పెళ్లి చేసేందుకు అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. బంధువులందరూ వివాహ వేడుకల్లో పాల్గొనేం దుకు తరలివచ్చారు. ఇంతలోనే పెళ్లి కుమారుడు అరెస్టయ్యాడన్న సమా చారంతో వధువు ఇంట తీరని శోఖాన్ని నిందింది. పొరండ్ల గ్రామానికి చెందిన వరుడు వంశీ జిల్లాలోని కోరుట్ల ప్రాంతానికి చెందిన ఓ మహిళ తో గత కొంతకాలం సన్నిహితంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడన్న మహిళ ఫిర్యాదు మేరకు వంశీని పోలీసులు అరెస్టు చేశారు. మరి కాసేపట్లో వరుడు వస్తాడని ఎదురు చూస్తున్న వధువు ఇంట్లో వరుడు అరెస్టయ్యాడన్న సమాచారం తో ఆందోళన నెలకొంది. దీంతో బంధువులందరూ వరుని గ్రామానికి తరలి వెళ్లారు. కొద్ది సేపట్లో పెళ్లి జరుగాల్సిన పందిరిలో వేడుక రద్దవడంతో పెళ్లి పందిరి బోసిపోయింది.