క్రైమ్/లీగల్

నగల షాపులో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం, ఆగస్టు 31: అర్ధ్రరాత్రి సమయంలో నగల షాపుకు కన్నంకొట్టి భారీగా వెండి, బంగారం దోచుకెళ్ళిన ఘటన మండలంలోని బొల్లారంలో చోటు చేసుకుంది. స్ధానికుల కధనం ప్రకారం బొల్లారంలో గత 20 సంవత్సరాలుగా నకోడా నగల వ్యా పారం పేరుతో సంజయ్ అనేవ్యక్తి వా యపారాన్ని నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి వ్యాపారాన్ని ముగించుకొని షాపుకు తాళ్ళం వేసి వెళ్ళాడు. అర్ధ్రరాత్రి దాటిన అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు షాపు వెనకభాగంలోని తలుపులను బద్దలుకొట్టి షాపు స్టోర్‌రూంలోనికి చొరబడ్డారు. గోడకు భారీ కన్నం వేసి నగల షాపులోకి చొరబడ్డారు. షాపులోని వస్తువులను చిందరవందరగా చేసి బయట వున్న 45 తులాల వెండి, 2లక్షల 50వేల విలువచేసే బంగారాన్ని 50వేల నగదు ను తస్కరించారు. ఉదయం షాపుకు గురైన సంఘటనను తెలుసుకుని బా ధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఘటనా స్ధలాన్ని డీఎస్‌పీ సీతారాం, సీ ఐ సతీష్‌లు ఘటనా స్ధలాన్ని సందర్శి ంచారు. క్లూస్‌టీంని రప్పించి జాగిలాలతో దర్యాప్తును ప్రారంభించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ధీమావ్యక్తం చేశారు. నగల షాపులో ఉన్న లాకర్‌ను దోపిడిదొంగలు తెరవకపోవడంతో భారీ నష్టం తగ్గిందని బాధితుడు తెలిపాడు. దొంగలు షాపులో చొరబడి బ యటఉన్న వెండిని, చిన్నచిన్న బం గారం వస్తువులను నగదును దోచుకెళ్ళారని తెలిపారు. ఎవరో తన షాపులకు గతంలో వచ్చినవారే ఈ పనిచేసి వుంటారని అనుమానం వ్యక్తం చేశాడు.