క్రైమ్/లీగల్

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారి రూ. 2 కోట్ల కుచ్చుటోపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఆగస్టు 30 : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఒక పత్తి వ్యాపారి మార్కెట్ యార్డులో ఉన్న కమీషన్ ఏజెంట్ల ద్వారా రూ. 2కోట్ల వరకూ పత్తి కొనుగోలు చేసి ఆ తర్వాత కమీషన్ ఏజెంట్లకు కొనుగోలు చేసిన పత్తికి సంబంధించి డబ్బులు ఇవ్వకుండా కుచ్చుటోపీ పెట్టినట్లు వ్యాపార వర్గాల ద్వారా తెలుస్తోంది. వివరాలు.. రైతులు తాము పండించిన పత్తి దిగుబడిని విక్రయించేందుకు ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి దళారీ ఏజెంట్ ద్వారా అమ్మకానికి పెడతారు. ఆ ఏజెంట్ ద్వారా పత్తి వ్యాపారులు కొనుగోలు చేసి ఆ పత్తిని జిన్నింగ్ ప్యాక్టరీలకు తీసుకెళ్లి దూదిబేళ్లుగా మారుస్తారు. దూది బేళ్లతో పాటు పత్తి విత్తనాలను కూడా స్పిన్నింగ్ యజమానులకు లేదా దూది బేళ్లను విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులకు విక్రయిస్తారు. ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో కొనుగోలు చేసిన దూదిబేళ్లను తమిళనాడులోని కోయంబత్తూర్, ఉత్తర భారతదేశంలోని రాజ్‌కోట్, పూణె, ముంబాయి, కర్నాటక ప్రాంతాల్లోని వ్యాపారులకు కూడా అమ్మకం చేస్తారు. ఈ కోవలోనే స్థానికంగా ఉంటున్న ఓ వ్యాపారి ఆదోని మార్కెట్‌యార్డులో కొనుగోలు చేసిన పత్తిని దూదిబేళ్లుగా మార్చి ఇతర ప్రాంతాల వ్యాపారులకు అమ్ముకున్నాడు. ఇలా ఆదోని మార్కెట్‌యార్డులో రూ. 2కోట్ల వరకూ కొనుగోలు చేసిన పత్తికి సంబంధించి నగదును ఆ వ్యాపారి రైతులకు చెల్లించకుండా కుచ్చుటోపీ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. చివరకు పత్తి వ్యాపారిని నిలదీసి తమ డబ్బులు చెల్లించమని ఏజెంట్లు కోరడంతో తన దగ్గర రూ. 2కోట్ల లేవని, పంచాయితీ చేసి సెటిల్‌మెంట్ చేస్తానని వ్యాపారి చెప్పడంతో ఒక జాతీయ పార్టీకి చెందిన నాయకుడి జిన్నింగ్ ఫ్యాక్టరీలో పంచాయితీ పెట్టినట్లు సమాచారం. తాను రూ. 2కోట్లు కట్టలేనని, ఉన్న మొత్తంలో సెటిల్‌మెంట్ చేసుకోవాలని ఆ వ్యాపారి చెప్పినట్లు సమాచారం. తమతో లక్షల్లో పత్తి కొనుగోలు చేసి ఇలా ఎగ్గొట్టడంపై కమీషన్ ఏజెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జీరో వ్యాపారం దందాలో కొందరు పత్తి ఇవ్వడం వల్ల ఎగనామం పెట్టినా పత్తి వ్యాపారిపై చట్టపరమైన చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని కొందరు కమీషన్ ఏజెంట్లు పేర్కొన్నారు. ఏదేమైనా కాటన్ వ్యాపారి నుంచి కమీషన్ ఏజెంట్లకు రూ. 2కోట్ల సొమ్ము వస్తుందో లేదో వేచి చూడాలి.