క్రైమ్/లీగల్

ఈ ఏడాది సుప్రీంలో ఏడుగురు జడ్జీల రిటైర్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: సర్వోన్నత న్యాయస్థానంలో ఈ ఏడాది ఏడుగురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీం కోర్టులో ఇప్పటికే ఆరుగురు న్యాయమూర్తుల అవసరం ఉంది. అలాగే ఇద్దరు న్యాయమూర్తులను నియమించాల్సిందిగా చేసిన సిఫార్సులు పెండింగ్‌లో ఉన్నాయి. మార్చి 1 నుంచి జడ్జీల రిటైర్‌మెంట్లు మొదలవుతున్నాయి. 1న జస్టిస్ అమితవ రాయ్ పదవీ విరమణ చేయనున్నారు. మార్చి 4న జస్టిస్ రాజేశ్ అగర్వాల్ రిటైరవుతున్నట్టు సుప్రీంకోర్టు, న్యాయశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. జస్టిస్ రాయ్‌కు శుక్రవారం ఆఖరి పనిదినం కాగా హోలీ పండుగ తరువాత 5న సుప్రీం కోర్టు పునఃప్రారంభమవుతుంది. సుప్రీం కోర్టులో అందరికంటే సీనియర్ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ జూన్ 22న పదవీ విమరణ చేస్తారు. జస్టిస్ ఆదర్శ్ గోయల్ జూలై 6న రిటైరవుతున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కూడా ఈ ఏడాదే పదవీ విరమణ చేయనున్నారు. మిశ్రా అక్టోబర్ 2న రిటైర్ అవుతారు. అలాగే జస్టిస్ కురియన్ జోసెఫ్ నవంబర్ 29న, జస్టిస్ మదన్ బీ లోకూర్ డిసెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నట్టు సుప్రీం వెబ్‌సైట్‌లో తెలిపారు. ఇప్పటికే ఆరుగురు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండగా ఎనిమిది మంది రిటైర్ కావడంతో సుప్రీంపై మరింత వత్తిడి పెరుగుతుంది. ఖాళీల భర్తీకి కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవల్సి ఉంది.