క్రైమ్/లీగల్

విద్యుదాఘాతానికి ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, ఆగస్టు 28: నందిపేట మండలం వనె్నల్(కే) గ్రామంలో ఎల్లంపల్లి సుబ్బయ్య(40)అనే వ్యక్తి గ్రామ శివార్లలోని మొక్కజొన్న తోటలో అడవి పందుల కోసం పెట్టిన విద్యుత్ వైర్లకు తగిలి, విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వనె్నల్(కే) గ్రామ శివార్లలో నెల్లూర్ జిల్లా అల్లూరు మండలం పురాణి గ్రామానికి చెందిన మృతుడు సుబ్బయ్య గత కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యులతో కలిసి వనె్నల్‌కు వలస వచ్చి కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, సోమవారం రాత్రి సుబ్బయ్య, మరికొంతమందితో కలిసి వనె్నల్(కే) గ్రామంలోని దుకాణానికి వెళ్లి ఇటుక బట్టిల వద్దకు వస్తుండగా, మార్గమధ్యలో బద్దం సాయారెడ్డి మొక్కజొన్న తోటలో కంకులు తెంచుకునేందుకు సుబ్బయ్య వెళ్లాడని, అక్కడ తోట చుట్టూ అడవి పందుల భారీ నుండి రక్షించుకునేందుకు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న విద్యుత్ వైరు తగలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మంగళవారం మృతుడి అన్న కుమారుడు వెంకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీ తరలించి, కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.