క్రైమ్/లీగల్

భార్యను కత్తితో పొడిచి హత్య చేసి.. ఆత్మహత్యకు పాల్పడ్డ భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్కతుర్తి, ఆగస్టు 27: జీవితంపై విరక్తి చెంది భార్యను కత్తితో పొడిచి హత్య చేసి భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన గడ్డం కొమురయ్య (80), గడ్డం కేదారమ్మ (76) గత కొంత కాలం నుండి జీవితంపై విరక్తి చెంది సోమవారం తెల్లవారుజాము 1 గంటల ప్రాం తంలో భార్యను కత్తితో పొడిచి తాను కూడా కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో భార్య కేదారమ్మ అక్కడికక్కడే చనిపోగా, సోమవారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే కొమురయ్యను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మండల కేంద్రానికి చెందిన కొమురయ్య, కేదారమ్మలకు నలుగురు బిడ్డలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో ఇద్దరు బిడ్డలు చనిపోగా, ఒక కుమారుడు సైతం గతంలో చనిపోయాడు. అప్పటి నుండి మనస్థాపానికి గురైన భార్యాభర్తలు ఈ ఉదయాన భార్యను పొడిచి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డా డు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్కతుర్తి పోలీసులు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.