క్రైమ్/లీగల్

అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, ఆగస్టు 27: పేదవాడికి అందాల్సిన రేషన్ బియ్యం కొందరు రేషన్ డీలర్ల చేతివాటం వలన పక్కదారి పడుతోంది. రేషన్ తూనికలు కొలతల్లో వ్యతాసాల వలన పేదవాడికి అందాల్సిన రేషన్ సరుకులు సక్రమంగా అందడం లేదు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపం వలన అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. సోమవారం తిరుపతి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ అంకయ్య, సీఐ కే.మద్దయ్య ఆచారి ఆధ్వర్యంలో సత్యవేడులోని తలవాయి అగ్రహారం, నరసరాజు అగ్రహారం పరిసర ప్రాంతాల్లోని రెండు వేరువేరు గృహాల్లో అక్రమంగా నిలువ ఉంచిన 300 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. పక్కాగా అందిన సమాచారం మేరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రాధాకృష్ణ ఆదేశాలతో డీఎస్పీ తన బృందంతో దాడులు నిర్వహించామన్నారు. ఆంధ్ర, తమిళనాడుకు చెందిన 14.326 టన్నుల రేషన్ బియ్యంతో పాటు 20కేజీల కందిపప్పునుకూడా స్వాధీనం చేసుకున్నారు.
రేషన్ ముఠా గుట్టురట్టు
రేషన్ దొంగల ముఠా సోమవారం విజిలెన్స్ అధికారుల దాడులతో గుట్టురట్టయింది. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని తిరుపతిలోని జిల్లా సివిల్ సప్లయర్స్ గోడౌన్‌కు పంపుతామన్నారు. ఈ దందా సత్యవేడుకు చెందిన ప్రభాకర్ నాయుడు నడుపుతున్నట్లు గుర్తించారు. ఇతనికి ముగ్గురు అనుచరులు ఉన్నారని, వారిని విచారించగా ఈ తంతు బయడపడిందన్నారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ అంకయ్య తెలిపారు.
అక్రమాలకు పాల్పడితే సమాచారం ఇవ్వండి
ఎవరైనా రేషన్ షాపుల్లో అక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని విజిలెన్స్ డీఎస్పీ అంకయ్య కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. 8008203335, 0877-2242062 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీసీఓ శ్రీనివాసులు, సత్యవేడు ఎస్‌ఐ మల్లేష్‌యాదవ్, హెడ్ కానిస్టేబుల్ కిశోర్‌కుమార్, ఆర్‌ఐ అనిల్, వీఆర్వో వెంకటరామయ్య, కానిస్టేబుళ్లు గంగాధరం, హరి తదితరులు పాల్గొన్నారు.