క్రైమ్/లీగల్

రెండు వారాల్లో కౌంటర్ దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 24: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల స్ధానిక మత్స్యకారుల ఉపాధి కోల్పోతున్నారని దాఖలైన పిటిషన్లపై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పోలవరం అథారిటీ, సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్ కోల్‌కతాలకు జాతీయ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోని డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాం నిర్మాణం వల్ల గోదావరి నీటి ప్రవాహాన్ని నిలిపివేయడం వల్ల స్థానిక మత్య్సకారులు జీవనోపాధికి విఘాతం కల్గుతుందని నాగేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను ఏన్జీటి విచారించింది. దీనిపై తనీఖీలు ఇన్లాండ్ ఫిషరీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోల్‌కతాను ఎన్జీటీ గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. తనిఖీల నివేదికను అందజేయాలని విచారణ సందర్భంగా ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 20కు వాయిదా వేసింది.