క్రైమ్/లీగల్

లాలూ, రాబ్రీపై ఈడీ చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రాబ్రీ దేవిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ నమోదు చేసింది. ఐఆర్‌సీటీసీ హోటల్స్ కేటాయింపులో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని, భారీగా నగదు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. లాలూ, రాబ్రీతోపాటు వారి కుమారుడు, బిహార్ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, పార్టీ సీనియర్ నేత పీసీ గుప్తా, ఆయన భార్య సరళ గుప్తా పేర్లను కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) చట్టం కింద ఈడీ స్థానిక ప్రత్యేక కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో చేర్చింది. లాలూ, కొంత మంది ఐఆర్‌సీటీసీ అధికారులు కలిసి పురీ, రాంచీల్లోని రెండు రైల్వే హోటళ్లను అక్రమ మార్గంలో సుజాతా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సబ్‌లీజ్‌కిచ్చారని ఈడీ తన చార్జిషీట్‌లో ఆరోపించింది. కొచర్స్‌కు చెందిన సుజాతా హోటల్స్ నుంచి భారీ మొత్తంలో సొమ్ము తీసుకున్నారన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. కాగా, హోటళ్లను సబ్‌లీజ్‌కు ఇచ్చినందుకు బదులుగా పీసీ గుప్తాకు చెందిన డిలైట్ మార్కెటింగ్ ప్రైవేట్ కంపెనీకి పాట్నాలోని అత్యంత కీలక ప్రాంతంలో స్థలాన్ని అప్పటి రాబ్రీ సర్కారు కేటాయించిందని ఈడీ చార్జిషీట్‌లో వివరించింది. అప్పట్లో ఉన్న మార్కెట్ ధరతో పోలిస్తే, గుప్తా కంపెనీకి ధారాదత్తం చేసిన భూమికి వసూలు చేసిన మొత్తం చాలా తక్కువని పేర్కొంది. తర్వాతి కాలంలో అదే కంపెనీ తన స్థలాన్ని రాబ్రీకి నామమాత్రపు ధరకు అమ్మేసిందని, ఈ విధంగా ఆమె పరస్పర ప్రయోజనాలు పొందారని తెలిపింది.
ఈ మొత్తం వ్యవహారంలో నగదు లావాదేవీలు మొత్తం గుప్తాకు చెందిన ఒక డొల్ల కంపెనీ ద్వారా జరిగాయని తెలిపింది. గుప్తా 151 షెల్ కంపెనీలను పెట్టాడని, వాటిలో అభిషేక్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ కూడా ఒకటని ఈడీ తన చార్జిషీట్‌లో స్పష్టం చేసింది. మార్కెట్ ధరకు ఏమాత్రం సంబంధం లేకుండా, అత్యంత తక్కువ ధరకు పాట్నాలో అత్యంత ఖరీదైన భూములను రాబ్రీ, ఆమె కుమారుడు తేజస్వి సొంతం చేసుకున్నారని వివరించింది. యూపీఏ భాగస్వామ్య పార్టీగా ఆర్‌జేడీ కొనసాగినప్పుడు, కేంద్రంలో రైల్వే మంత్రిగా వ్యవహరించిన లాలూ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారని ఈడీ ఆరోపణ.

తేజస్వి యాదవ్, ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, రాబ్రీ దేవి (ఫైల్ ఫొటో)