క్రైమ్/లీగల్

సిద్ధూపై దేశద్రోహం కేసు నమోదు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముజఫర్‌పుర్, ఆగస్టు 21: పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్థూపైన ఇక్కడి కోర్టులో దేశ సమగ్రత దెబ్బతీసే విధంగా వ్యవహరించారని అభియోగంపై స్థానిక న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఒకవైపు మన దేశ సరిహద్దుల్లో జవాన్లు ప్రాణాలొడ్డి పోరాటం చేస్తుంటే, శత్రుదేశ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్న విషయం విదితమే. స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓహజా పంజాబ్ మంత్రి సిద్ధూపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఈ నెల 24వ తేదీన విచారిస్తామని కోర్టు ప్రకటించింది. భారతీయుల మనోభావాలను గాయపరిచే విధంగా సిద్ధూ వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సిద్ధూ ఆలింగనం దేశ సరిహద్దుల్లో పోరాడుతూ ప్రాణాలు విడిచిన జవాన్ల కుటుంబాలను అవమానపరిచినట్లేనని ఫిర్యాదులో కోరారు. ఐపీసీ 124ఏ, 153బి, 504, కింద కేసులు నమోదు చేయాలని న్యాయవాది కోరారు.