క్రైమ్/లీగల్

క్రికెట్ బుక్కీల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), ఆగస్టు 16: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లకు పాల్పడుతున్న క్రికెట్ బుక్కీలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను గురువారం రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకటప్పల నాయుడు విలేఖర్లకు వివరించారు. నర్సరావుపేట శివారు ఎస్‌ఆర్‌కెటి కాలనీ వెనుకవైపునున్న ఓ వెంచర్‌లో బుధవారం రాత్రి కర్ణాటక ప్రీమియం లీగ్ టీ20 మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తుండగా నిందితులను నర్సరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద 2.85 లక్షల రూపాయల నగదుతోపాటు కారు, కమ్యూనికేటర్ బాక్సు, ల్యాప్‌ట్యాప్, కేజీన్నర గంజాయి, 8 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో నర్సరావుపేట రామిరెడ్డిపేటకు చెందిన గోపి, నవీన్, రావెళ్ల, ఈపూరుకు చెందిన బాబా, నర్సరావుపేట 2-టౌన్ పోలీసుస్టేషన్‌లో జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్న మోహన్ ఉన్నారు.
జూదరుల అరెస్ట్..
జూదంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, స్కాలర్ల సాయంతో తోటి జూదరులను మోసగిస్తున్న తెనాలి పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని, కృష్ణాజిల్లాకు చెందిన మరోవ్యక్తిని విజయవాడలోని బెంజ్‌సర్కిల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్‌లు, కారు, ప్రత్యేకంగా తయారు చేసిన పేకముక్కలు, 44,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.