క్రైమ్/లీగల్

ఆటో బోల్తా పడి ఇంజనీరింగ్ విదార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, ఆగస్టు 13: నడిరోడ్డుపై ఉన్న గొయ్యి వర్షపు నీటితో నిండి ఉండటంతో వేగంగా వస్తున్న ఆటో డ్రైవర్ గుంటను గమనించకుండా వేగంగా రావడంతో గుంటలో దిగిన ఆటో బోల్తా కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఇంజనీరింగ్ విదార్థి మృత్యువాత పడగా మరో వ్యక్తి తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడుతున్నాడు. గుంటూరు-కర్నూలు రహదారిలో సంతమాగులూరు-పాతమాగులూరు మధ్యగల ఊరవాగు వద్ద సోమవారం రాత్రి 8.0గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో వెల్లలచెరువు గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న పోతకోట సాయిబాబు(20) మృతి చెందగా సంతమాలులూరు కు చెందిన తియ్యగూరి సుబ్బారెడ్డికి తీవ్రగాయాలవడంతో నరసరావపేట వైద్యశాలకు తరలించారు.వివరాల్లోకి వెళితే...నరసరావుపేట నుండి వినుకొండ వైపు వెళుతున్న ప్యాసింజర్ ఆటోలో మృతుడు సాయిబాబుతోపాటు క్షతగాత్రుడు సుబ్బారెడ్డి మరో ముగ్గురు నరసరావుపేటలో ఎక్కారు. ఆటో వేగంగా వస్తుండగా పాతమాగులూరు దాటిన తరువాత ఊరవాగు దాటగానే ఆటో ముందు చక్రం రోడ్డుమధ్యలో ఉన్న గోతిలో దిగడంతో ఆటో బోల్తాకొట్టింది. ఆటోలో ప్రయాణిస్ను విదార్థి సాయిబాబు ఆటోకింద పడి కనిపించకుండా ఉండగా మరో క్షతగాత్రుడైన సుబ్బారెడ్డి ఆటో కిందపడి కొంతభాగం కనిపిస్తుండటంతో అతన్ని ముందు బయటకులాగారు. ఆ తరువాత కొద్దిసేపటికి పరిసర ప్రజలు వచ్చి ఆటో లేపేసరికి ఆటోకింద విద్యార్థి సాయిబాబు మృతి చెంది ఉన్నాడు. సాయిబాబు మృతిచెందడం, సుబ్బారెడ్డి గాయాలపాలవడం మినహా ఆటోలోప్రయాణిస్తున్న వారందరూ క్షేమంగా బయటపడ్డారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై నాగరాజు ఘటనపై విచారణ చేపట్టారు.