క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ టీచర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాప్తాడు, ఆగస్టు 12 : మండలంలోని మరూరు వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశ్‌రావు (67) మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశ్‌రావు, సాకే నాగరాజులు ధర్మవరం నుండి వ్యక్తిగత పనులమీద ద్విచక్ర వాహనంలో అనంతపురంకు వెళ్తుండగా మార్గమధ్యలో మరూరు వద్దకు రాగానే జాతీయ రహదారిపై లారీ ఢీకొన్న సంఘటనలో ప్రకాశ్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. సాకే నాగరాజు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ప్రకాశ్‌రావు టీచర్‌గా పనిచేస్తూ పదవీ విరమణ పొందారని పోలీసులు తెలిపారు. గాయపడిన నాగరాజును చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ధరణిబాబు తెలిపారు.