క్రైమ్/లీగల్

అత్యాచార బాధితుల ఫొటోలు, వీడియోలు చూపొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: అత్యాచారానికి గురైన బాధితుల ఫొటోలను ప్రింట్ చేయడం కాని, వీడియోల్లో చూపడం కాని ఎట్టిపరిస్థితుల్లో చేయవద్దని సుప్రీం కోర్టు దేశంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలను ఆదేశించింది. కనీసం వారి ఫొటోలను బ్లర్ (మసక) చేయడం, మార్ఫింగ్ (మార్చడం) లాంటివి కూడా చేసి చూపవద్దని పేర్కొంది. అంతేకాకుండా బాధిత మైనర్లను మీడియా వారు ఇంటర్వ్యూ చేయడం కూడా తీవ్రమైన విషయంగా పరిగణిస్తామని, ఇది వారి మనసులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. ఇప్పటికే బాధితులకు అన్నివైపుల నుంచి అన్యాయం జరుగుతోందని పేర్కొంది. జస్టిస్‌లు ఎంబి లోకుర్, దీపక్ గుప్తా, కెఎం జోసఫ్‌లతో కూడిన ధర్మాసనం ముజఫర్‌లోని శరణాలయానికి ప్రభుత్వ నిధులు ఇవ్వడంపై బిహార్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. లైంగిక బాధితులైన బాలికలను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్), రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌లు మాత్రమే కౌన్సిలర్ల సమక్షంలో మాత్రమే ఇంటర్వ్యూ చేయాలని కోర్టు పేర్కొంది. దేశంలోని శరణాలయాలలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల నిరోధానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుందో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీ మహిళా కమిషన్ వారు బిహార్ శరణాలయ కేసులో జోక్యం చేసుకోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావు లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) డాటాను ఉటంకిస్తూ భారత్‌లో ప్రతి ఆరు గంటలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. 2016లో భారత్‌లో 38,947 మందిపై అత్యాచారం జరిగినట్టు ఈ డాటా వెల్లడిస్తోందన్నారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్ నిర్వహించిన సర్వేలో బిహార్‌లోని 110 శరణాలయాలలో 15 సంస్థల తీరు ఘోరంగా ఉందని కోర్టుకు తెలిపింది. దీనిపై బిహార్ ప్రభుత్వం వివరణ ఇస్తూ ఈ 15 శరణాలయాలలో నివసిస్తున్న వారిపై లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారించి తొమ్మిది కేసులు నమోదు చేసినట్టు చెప్పింది. ఇందులో అందరికంటే ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులను పొందుతున్న బ్రజేష్ ఠాకూర్ నిర్వహిస్తున్న శరణాలయంలో 30 మంది బాలికలపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ కేసును ఇప్పుడు సీబీఐ విచారిస్తోందని అన్నారు. ఇందులో నివసిస్తున్న 42 మందిలో 32 మందిపై అత్యాచారం జరిగిందని, ఇంకో ఇద్దరిని పరీక్షించాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆ సంస్థను బ్లాక్‌లిస్టులో ఉంచి అందులో ఉంటున్న వారిని పాట్నా, మధుబనిలోని శరణాలయాలకు తరలించామని, ఈ కేసుకు సంబంధించి నిర్వాహకుడు ఠాకూర్, మహిళా సిబ్బందిని అరెస్ట్ చేశామని బిహార్ ప్రభుత్వ తరఫుప్రతినిధి కోర్టుకు తెలిపారు.