క్రైమ్/లీగల్

వైద్య విద్యార్థిని బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు/తిరుపతి: ఎంతోమంది రోగులకు ప్రాణభిక్ష పెట్టాల్సిన ఓ మహిళా డాక్టర్ ఎస్వీయూ వైద్యకళాశాలలో ప్రొఫెసర్ల నుంచి తనకు ఎదురైన వేధింపులు, ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోగా తనకు అన్యాయం జరిగిందని మనోవేదనకు గురై చిత్తూరు జిల్లా పీలేరులో నివాసం ఉంటున్న డాక్టర్ శిల్ప (31) సోమవారం అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మెడికల్ కళాశాలలోని తోటి విద్యార్థులు అధికారులపై నిప్పులు చెరిగారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. తక్షణం ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రిన్సిపాల్ రమణయ్య కార్యాలయం ముందు ధర్నా చేశారు. అయితే వారిని తొలగించే అధికారం తనకు లేదని, ఈ విషయాన్ని తన పైఅధికారుల దృష్టికి తీసుకెళతానని ప్రిన్సిపాల్
ఇచ్చిన హామీ వైద్య విద్యార్థులను సంతృప్తిపరచలేదు. శిల్ప బలవన్మరణ వార్త మీడియాలో విస్తృతంగా రావడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. శిల్ప ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె స్వగ్రామ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. శిల్ప తండ్రి గంగాధరం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏజీఎంగా పనిచేస్తున్నారు. తిరుపతి వైద్య కళాశాలలో సీటు సాధించి ఎంబీబీఎస్ పూర్తిచేసుకొని డాక్టర్ అయ్యింది. ఈ మధ్యకాలంలో పీజీలో చేరింది. తనను ముగ్గురు ప్రొఫెసర్లు వేధిస్తున్నారని వారి పేర్లతో పాటు పైఅధికారికి ఫిర్యాదు చేసింది. స్పందన లేకపోవడంతో గవర్నర్‌కు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహన్ స్పందించి విచారణకు కమిటీ వేశారు. అయితే కమిటీలోని అధికారులు ప్రొఫెసర్‌లది ఏమీ తప్పులేదని, శిల్ప చెప్పినట్లు ఏమీ జరగలేదంటూ తూతూమంత్రంగా విచారణ జరిపి తేల్చేశారు. దీంతో మరింత ఆవేదనకు గురైన శిల్ప జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను ఆశ్రయించి తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించింది. దీంతో స్పందించిన కలెక్టర్ విచారణకు కమిటీని వేశారు. ఆ కమిటీకి తాను చైర్మన్‌గా ఉంటూ జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎస్పీ, తుడా వైస్ చైర్మన్‌తో దీన్ని ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం వేధింపులు జరిగాయని కమిటి సభ్యులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఈలోపు శిల్ప పీజీ పరీక్షలు రాసింది. అందులో ఆమె తప్పినట్లుగా ప్రకటించారు. ఈక్రమంలో శిల్ప రీవాల్యుయేషన్ కోరింది. అందులోనూ ఆమె తప్పినట్లుగా రావడంతో తీవ్ర కలత చెందింది. ఒక వైద్య విద్యార్థికి సంబంధించి కొన్ని మార్కులు ప్రొఫెసర్ల పరిధిలో ఉండటంతో ఉద్దేశ్యపూర్వకంగానే తనను ఫెయిల్ చేయించారని వ్యధ చెందింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పీలేరులోని తాను నివాసం ఉంటున్న జాగృతి అపార్ట్‌మెంట్‌లో భర్త రూపేష్‌కుమార్‌రెడ్డి, అత్త, తన బిడ్డ ఋషితోకలసి భోజనం చేసింది. అటు తరువాత బిడ్డతో కలసి శిల్ప తన గదికి వెళ్లి విశ్రమించింది. ఆ సమయంలో భర్త హాలులోనూ, అత్త మరో గదిలోనూ ఉన్నారు. కొంత సమయానికి గదిలో ఎవరో కిందపడ్డ శబ్దం రావడం, అదే సమయంలో బిడ్డ ఏడుపు వినబడటంతో నిద్రలోకి జారుకున్న భర్త రూపేష్‌కుమార్‌రెడ్డి ఒక్కసారిగా ఉలిక్కిపడి శిల్ప ఉన్న గది తలుపులు తట్టాడు. లోపల గది గడియ పెట్టి ఉండటంతో పొరుగువారి సహాయంతో తలుపులు బద్దలు కొట్టించారు. అయితే అప్పటికే శిల్ప తాను పడుకున్న బెడ్డుపై కుర్చీ వేసుకొని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కిందకి జారడంతో మృతి చెందింది. ఊహించని ఈ పరిణామానికి భర్త, అత్త, బిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపించారు. అటు తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డాక్టర్ శిల్ప (ఫైల్‌పొటో)