క్రైమ్/లీగల్
సట్టా బెట్టింగ్ రాకెట్‌పై పోలీసుల దాడులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, ఆగస్టు 3: సికింద్రాబాద్ లాల్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సట్టా బెట్టింగ్ రాకెట్‌ను టాస్క్ఫుర్స్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో నిందితులు దొరికిపోయారు. దాడుల్లో 12 మందిని అరెస్టు చేశారు. సట్టా బెట్టింగ్‌ను శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు టాస్క్ఫుర్స్ అడిషనల్ కమిషనర్ రాధాకృష్ణా రావు తెలిపారు.
బొమ్మల దిలీప్ కుమార్ అరెస్టు
నగరంలో గృహ నివాసాల సమీపంలో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను తస్కరించడంలో దిలీప్ కుమార్ చేతివాటం చూపించేవాడని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. దిలీప్ కుమార్‌పై 18 కేసుల్లో నిందితుడని చెప్పారు. ఇతనిపై పీడీ చట్టాన్ని నమోదు చేసినట్లు చెప్పారు.
ఇద్దరు కానిస్టేబుల్స్‌కు మెడల్స్
హైదరాబాద్ నగర పోలీస్ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ బాక్స్ంగ్లో ఛాంపియన్ దక్కించుకున్న హీరోలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అభినంధించారు. మొగల్పుర స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పీ.నాగరాజు (2083), మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సునీల్ కుమార్ (6021) గత నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కోల్‌కత్తాలో జరిగిన వర్డ్ల్ 2వ అమ్యుచర్ వర్డ్ల్ చెస్ బాక్స్ంగ్ ఛాంపియన్ చిప్‌లో బంగారు పతకాలు సాధించారు.