క్రైమ్/లీగల్

భారత్‌ను కోర్టుకు లాగిన మారిషస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఇందూటెక్ జోన్ పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో మారిషస్ ప్రభుత్వం ఇండియాను అంతర్జాతీయ కోర్టుకు లాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులు పెండింగ్‌లో ఉన్న కారణంగా అతడికి సంబంధం ఉన్న ఇందూటెక్ జోన్ పెట్టుబడులతో ప్రారంభం కావలసిన పనులు మూలనపడిపోయాయని, దీనివల్ల తాము నష్టపోతున్నామని, తమ సంస్థను మోసగించారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని మారిషస్‌కు చెందిన కరిస్సా ఇనె్వస్ట్‌మెంట్స్ అక్కడి ప్రభుత్వాన్ని ఆశ్రయించగా ఆ వివాదాన్ని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫర్ ఆర్బిట్రేషన్ దృష్టికి మారిషస్ తీసుకువెళ్లింది. 50వేల డాలర్ల మేర ఆర్బిట్రేషన్ కోరిన మారిషస్ ప్రభుత్వం ప్రధాని మోదీ, ఆర్థిక, న్యాయ, వాణిజ్య, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులకూ నోటీసులు జారీ చేసింది. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాల మేరకు పెట్టుబడులకు రక్షణ కల్పించాల్సి ఉందని, అయితే సీబీఐ, ఈడీ కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల కరిస్సా పెట్టుబడులను నష్టపోయే పరిస్థితి వచ్చిందని, భారత ప్రభుత్వం వెంటనే ఆర్బిట్రేటర్‌ను నియమించాలని ఆ నోటీసుల్లో కోరారు. కాగా ఆర్బిట్రేటర్ నియామకం వ్యవహారంపై చర్చించేందుకు వివిధ మంత్రిత్వశాఖల సమన్వయ సమావేశం నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఇందూటెక్ ఐటీ సెజ్‌లో మార్టిగేజ్ చేసిన స్థలంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇందూ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కాంట్రాక్టు పొందారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో శ్యామ్‌ప్రసాద్ కూడా నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆ పనులు ఆగిపోయాయి. ఇందూటెక్ జోన్‌లో 49 శాతం వాటాలను కలిగి ఉన్న కరిస్సా ఇనె్వస్ట్‌మెంట్స్ (మారిషస్) ఇప్పుడు స్పందించింది. కేసుల కారణంగా తమ పనులు ఆగిపోయాయని, పెట్టుబడులు నష్టపోతున్నామని కరిస్సా మారిషస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.