క్రైమ్/లీగల్

బాలుర వసతి గృహంలో విద్యార్థి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, జూలై 29: కడ్తాల మండల కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థి వి.మల్లేశ్(14) శనివారం అర్ధరాత్రి అనుమానస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. దీంతో తోటి విద్యర్థులు వాచ్‌మెన్‌లు కలసి విద్యార్థిని తల్లి దండ్రులకు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచడంపై విద్యార్థి కుటుంబ సభ్యులు బంధువులు కడ్తాల గిరిజన బాలుర వసతి గృహం ఎదుట హైదరాబాద్ - శ్రీశైలం జాతియ రహదారి పై పెద్ద ఎత్తున రాస్తారోకో చేసి ఆందోళన చేపట్టారు. విద్యార్థి తల్లిదండ్రులు దశరథం, మస్రు మామ రవీందర్ మాట్లాడుతూ తమకు ఒక్క మాట చెప్పకుండా మల్లేష్ చనిపోయాడని, కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆవేదన వ్యక్తం పరిచారు. వసతి గృహం వార్డెన్ స్థానికంగా ఉండటం లేదని, ఇంత వరకు తమకు సమాచారం ఇవ్వలేదని అగ్రహం వ్యక్తం చేశారు. వీరికి పలు విద్యార్థి సంఘాల నాయకులు మద్ధతు తెలిపారు. తమకు న్యాయం జరిగెంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించి కుర్చున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు ఎస్‌ఐలు సుందరయ్య, మల్లేశ్వర్, సురేశ్ యాదవ్ బందోబస్తు ఎర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు గోలి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీటీడబ్లూవో రమాదేవి హుటాహుటిన కడ్తాల గిరిజన వసతి గృహనికి చేరుకొని పరిస్థితిని సమిక్షించారు. విదార్థి మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులు బంధువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వినకుండా ఆందోళన కొనసాగించారు. ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి టీఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు గోలి శ్రీనివాస్ రెడ్డి పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు పోన్లో మాట్లాడి జరిగిన విషయాన్ని వివరించారు.