క్రైమ్/లీగల్

విహారయాత్రలో విషాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ/చింతపల్లి, జూలై 29: విహార యాత్రకు బయలుదేరిన కుటుంబాన్ని అతివేగం బలితీసుకుంది. ఆదివారం సెలవుదినం కావడంతో నాగార్జునసాగర్ విహార యాత్రకు కారులో వెళ్తున్న హైద్రాబాద్ టోలిచౌక్‌కి చెందిన ఐదుగురితో పాటు ఐదేళ్ల బాలుడు కారు ప్రమాదానికి గురవ్వడంతో దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయ. హైద్రాబాద్ టొలిచౌక్ అసఫ్‌నహర్‌కు చెందిన ఎండి.ఖాశీం తన కుటుంబ సభ్యులు తొమ్మిది మందితో పాటు కారు డ్రైవర్ ముఖీమ్‌తో కలిసి ఉదయం 5గంటలకు విహార యాత్రకు నాగార్జునసాగర్ బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు అతివేగంతో నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్-హైద్రాబాద్ రాష్ట్ర రహదారి చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద అతివేగంతో బస్ షెల్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఖాశీం భార్య అక్తర్ (50), కుమారులు ముస్త్ఫా (30), అబ్బాస్ (25), అక్క అసియాబేగం (55)తో పాటు షేక్ మోహిన్ (45), కుమారుడు షేక్ అఫీజ్ అలియాస్ సమ్మి (5)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో ఉన్న మరో నలుగురు నూరి బేగం, ఖాశీం, హుస్సెన్, డ్రైవర్ ముఖింలు మాత్రం స్వల్ప గాయాలతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. కారు ప్రమాదంలో కారు ముందు సీట్లు కూర్చున్న తండ్రీ కొడుకులు షేక్ మోహిన్, ఐదేళ్ల సమ్మిలు ఇద్దరు మృతి చెందగా ప్రమాదం నుండి బయటపడిన మోహిన్ భార్య నూరి బేగం తనవారి మృతి పట్ల తీవ్ర విషాదానికి గురైంది. అలాగే, కారులో ఎడమవైపు కూర్చున్న అన్నదమ్ములు ముస్త్ఫా, అబ్బాస్‌లు, వారి తల్లి అక్తర్‌లు చనిపోవడంతో భార్య, కుమారులను కోల్పోయిన ఖాసీం కన్నీరుమున్నీరయ్యారు. కారు బస్ షెల్టర్‌ను ఢీకొన్న సమయంలో అక్కడే ఉన్న స్థానికుడు నల్ల అంజయ్యకు స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన గ్రామస్థులు హుటాహుటిన కారు వద్దకు వెళ్లి క్షతగాత్రులను బయటకు తీసి సహాయ చర్యలు చేపట్టారు. టోలిచౌక్ అసిఫ్‌నహర్ నుండి కాశీం కారుతో పాటు మరో మూడు కార్లులో వారి బంధువులు సైతం సాగర్‌కు బయలుదేరారు. తమ కళ్ల ముందే ఖాశీం కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఆరుగురు చనిపోవడంతో వారంతా తీవ్ర ఆందోనకు గురై తమవారి మృతదేహాలను చూసి తీవ్రంగా రోదించారు. ప్రమాద స్థలాన్ని డిఎస్పీ రవికుమార్, సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐలు నాగభూషణ్‌రావు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
సాగర్ విహారానికి వచ్చి మరొకరు..
నాగార్జున సాగర్: నాగార్జునసాగర్‌కు విహారానికి ఖమ్మం నుండి కారులో వచ్చి వెలుతున్న కుటుంబానికి కారు ప్రమాదం విషాదం మిగిల్చింది. ఖమ్మం చెందిన ఉట్కూరు జనార్దన్ (31) తన భార్య, ఇద్దరు కుమారుడు, కుమార్తెతో, అత్తామామలతో కలిసి ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నాగార్జునసాగర్ విహార యాత్రకు సొంత కారులో వచ్చారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. హిల్ కాలనీ బుద్దవనం దాటిన తరువాత పిల్లలు ఎత్తిపోతల జలపాతం చూడాలని కోరడంతో కారును వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో హుజూర్‌నగర్ నుండి సాగర్ సందర్శనకు వస్తున్న మరో కారు జనార్ధన్ కుటుంబం కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న జనార్ధన్ సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందాడు. భార్య యామిని శృతి, హుజూర్‌నగర్ కారులో ఉన్న ఫర్విద్ అహ్మద్, నసీనాకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను, జనార్ధన్ మృతదేహాన్ని సాగర్ ఆసుపత్రికి తరలించారు.

చిత్రాలు.. అదుపు తప్పి బస్‌షెల్టర్ గోడను ఢీకొన్న కారు,* కారులోంచి మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యం