క్రైమ్/లీగల్

యూపీలో నకిలీ ఎగ్జామ్ బోర్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: మనం ఇంతవరకు దొంగ సర్ట్ఫికెట్లను తయారు చేసే వాళ్లను మాత్రమే చూశాం. ఇప్పుడు ఏకంగా సెకండరీ బోర్డులనే ఏర్పాటు చేసి సర్ట్ఫికెట్లను జారీచేస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి సీబీఐ రెండు వేర్వేరు కేసులను నమోదు చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. సెకండరీ బోర్డును ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి 10, 12వ తరగతి సర్ట్ఫికెట్లను సైతం వారు జారీచేసేస్తున్నారు. ఈ సర్ట్ఫికెట్లతో ఉద్యోగం సంపాదించినవారి విషయం కోర్టు వరకూ వెళ్లడంతో అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ తీగలాగితే డొంకంతా కదిలింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో, కాంస్‌గంజ్‌లో రెండు ముఠాలు ఈ సెకండరీ బోర్డును నిర్వహిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ‘బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మధ్యభారత్, గ్వాలియర్’ పేరుతో వీరు సర్ట్ఫికెట్లను జారీచేశారు. కాస్‌గంజ్‌లో గంగా దయాళ్ సక్య, ఘజియాబాద్‌లో మహేశ్ చంద్రవంశీ ఈ బోర్డులను నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు కొందరు ఈ బోర్డు సర్ట్ఫికెట్లను జతచేయడంలో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సెకండరీ స్కూలు కౌన్సిల్ (సీఓబీఎస్‌ఇ) గుర్తింపుతోపాటు ఎటువంటి గుర్తింపూ లేదు.