క్రైమ్/లీగల్

యువతి హత్యకేసులో నిందితుని అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడికొండూరు, జూలై 29: మండలంలోని కైలాసగిరి కొండల్లో పది నెలల కిందట జరిగిన గుర్తు తెలియని యువతి హత్య కేసులో మిస్టరీ వీడింది. యువతి హత్య కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సైతం ఉహించని విధంగా ఓ ఖైదీ ఇచ్చిన సమాచారంతో హత్య కేసులో నిందితుడ్ని పోలీసులు గుర్తించారు. కేసు వివరాలు గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్‌పి ఆర్‌వివిఎస్‌ఎన్ మూర్తి ఆదివారం విలేఖర్ల సమావేశంలో వివరిస్తూ... చిలకలూరిపేట పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన యువకుడు అప్పల ఉదయ భాస్కర్ దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటాడు. ఇతని తల్లి మరణించగా, తండ్రి వదిలివెళ్లిపోయాడు. ఉదయ భాస్కర్ దొంగతనాలు చేయడం, గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడు. ఉదయ భాస్కర్ గత జూలైలో తిరుపతి వెళ్లగా ఓ యువతి తారస పడింది. ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఆమెను పరిచయం చేసుకుని వివరాలు తెలుసుకున్నాడు. తన పేరు లక్ష్మీ అని కర్ణాటక నుంచి వచ్చానని తెలిపింది. ఆమెకు ఎవరూ లేరని తెలుసుకున్న ఉదయ భాస్కర్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి చిలకలూరిపేటకు తీసుకువచ్చాడు. తాను ఉంటున్న ఇంట్లోనే ఆమెను కూడా ఉంచాడు. కొద్దిరోజుల తర్వాత ఇతనితో కలిసి గంజాయి సేవించే బొక్కా నాగరాజు, బండారు పవన్, కె బాబూనాయక్‌లకు ఆ యువతిని చూపించి తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. వీరంతా యువతి వద్దకు వచ్చి వెళ్తుండటంతో వారితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఉదయ భాస్కర్ ఆమెను కొట్టాడు. దీంతో ఆమె కొద్దిరోజుల పాటు కనిపించకుండా వెళ్లిపోయింది. ఆమె కోసం ఉదయ భాస్కర్ వెతుకులాట ప్రారంభించగా చిలకలూరిపేటలోనే కనిపించింది. వెంటనే పెళ్లి చేసుకుందామని చెప్పి మేడికొండూరు మండలం, కైలాసగిరి కొండపైకి తీసుకువచ్చాడు. అక్కడ కొంతసేపు గడిపిన తర్వాత యువతిని దారుణంగా బండరాయితో కొట్టి హతమార్చారు. మేడికొండూరు గ్రామ కార్యదర్శి పూర్ణచంద్రరావు వద్దకు వచ్చి నేరం అంగీకరించాడు. దీంతో గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు ఉదయ భాస్కర్‌ను అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల క్రితం నిందితుడు ఉదయ భాస్కర్ చిలకలూరిపేటలో ఓ యాచకుడిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కేసు కూడా నమోదైందని తెలిపారు.
ఖైదీ ఇచ్చిన సమాచారంతోనే నిందితుడు అరెస్ట్..
కైలాసగిరి కొండపై గుర్తు తెలియని యువతి హత్యకేసు పోలీసులకు సవాల్‌గా ఏర్పడింది. అయితే ఈ కేసులో నిందితుడైన ఉదయ భాస్కర్‌కు ఒక చోరీ కేసులో శిక్ష పడటంతో ఆరు నెలల కింనటట జైలుకు పంపారు. అక్కడ తోటి ఖైదీలతో తాను ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి హత్య చేసినట్లు తెలిపాడు. ఆ ఖైదీని అర్బన్ పోలీసులు విచారిస్తుండగా యువతి హత్యకేసు గురించి తనకు తెలిసిన సమాచారం అందించాడు. ఇతని సమాచారం మేరకు మేడికొండూరు పోలీసులు చిలకలూరిపేటలోని గాంధీనగర్‌కు వెళ్లి విచారించారు. జైలు నుంచి విడుదలైన ఉదయ భాస్కర్ తనకోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకుని పంచాయతీ కార్యదర్శి వద్ద లొంగిపోయాడు. కాగా హతురాలు ఎవరైందీ పోలీసులకు నేటికీ మిస్టరీగానే మిగిలింది.