క్రైమ్/లీగల్

మహిళా వైద్యురాలికి వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, జూలై 28: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్డులోని వాసవి నగర్‌లో గల ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలికి వేధింపులు అధికం కావడంతో పోలీస్‌స్టేషన్‌లో ఆమె చేసిన ఫిర్యాదు మేరకు శనివారం ఎస్సై అల్లు దుర్గారావు అయిదుగురు సహ వైద్యులపై కేసు నమోదు చేశారు. స్థానిక రాజులకాలనీలో నివాసం ఉంటూ కార్పొరేట్ ఆసుపత్రిలో పని చేస్తున్న 23 సంవత్సరాల వయస్సు గల వైద్యురాలిని అదే ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ శేఖర్ వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నువ్వు అంటే నాకు ఇష్టం, పెళ్ళి చేసుకుంటాను, పెద్దలను ఇంటికి పంపించి అడిగిస్తాను అంటూ గత వారం రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నట్టు తెలిపారు. డాక్టర్ శేఖర్‌కు మరో నలుగురు వైద్యులు సహకరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. కాగా వైద్యురాలికి వారం రోజుల క్రితం వివాహం నిశ్ఛయమైందని, ఆమెకు ఇష్టం లేక పోయినా పెళ్ళి చేసుకుంటానని డాక్టర్ శేఖర్ వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎస్సై అల్లు దుర్గారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.