క్రైమ్/లీగల్

రెండు నాటు తుపాకులు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, జూలై 28: తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఓ గిరిజనుడి ఇంటిలో రెండు నాటుతుపాకులు, దుప్పి కొమ్ములతో ఉన్న పుర్రెను స్వాధీనం చేసుకున్నట్టు రంపచోడవరం డివిజన్ అటవీ శాఖ రేంజ్ అధికారి ఎ సునీల్‌కుమార్ తెలిపారు.అటవీశాఖ సిబ్బందికి అందిన సమాచారం మేరకు మారేడుమిల్లి మండలం చట్లవాడ పంచాయతీ పరిధిలోని కెచ్చెలవాడ గ్రామంలో పల్లాల దేవిరెడ్డి అనే గిరిజనుడి ఇంట్లో సోదాలు నిర్వహించగా మిద్దెపై నాలుగు దుప్పి కొమ్ములతో ఉన్న పుర్రెలు, రెండు నాటుతుపాకులను శనివారం స్వాధీనం చేసుకునట్టు ఆయన తెలిపారు. నిందితుడు దేవిరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. దేవిరెడ్డి కోసం అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారన్నారు.