క్రైమ్/లీగల్

చెల్లిని కత్తితో పొడిచిన అన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 28 : చెల్లెలు కులాంతర వివా హాం చేసుకుందని ఆగ్రహించిన అన్న కత్తితో పొడిచిన దారుణమైన సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. ఈసంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వీరాపూర్ గ్రామానికి చెందిన వౌనిక తన క్లాస్‌మెట్ సాయిలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కులాలు వేరు కావటంతో పెద్దలు ప్రేమను అంగీకరించకుండ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గత 15రోజుల క్రితం వౌనిక డిగ్రీ క్లాస్ మెట్ ఆయిన సాయిలును హైదరాబాద్ ఆర్యాసమాజ్‌లో వివాహం చేసుకుంది. కులాంతర వివాహం కావటంతో పెళ్లికి అంగీకరించని వౌనిక కుటుంబీకులు మూడు రోజుల పురుగుల మందు డబ్బాతో వౌనిక ఇంటికి వద్దకు వెళ్లారు. నీవు రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తల్లి బెదరించినట్లు తెలిపారు. దీంతో భయంతో వౌనిక పుట్టింటికి వచ్చింది. వచ్చినప్పటి నుండి కుటుంబీకులు, సోదరుడు నాగరాజులు కులాంతరం వివాహం చేసుకొని తమ పరువు తీశావని సూటిపోటీ మాటలతో వేధింపులకు గురిచేయటం, కొట్టినట్లు తెలిపారు. దీంతో వౌనిక ఈవిషయాన్ని తన భర్త సాయికి చెప్పి నన్ను వచ్చి తీసుకపోవాలని ఫోన్‌లో వివరించింది. దీంతో ఆగ్రహించిన సోదరుడు నాగరాజు కత్తితో చెల్లెలు వౌనికపై దాడి చేసి దారుణంగా పొడిచాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వౌనికను కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. వౌనిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బెజ్జంకి ఎస్‌ఐ అభిలాష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్న వౌనిక, సాయి