క్రైమ్/లీగల్

ఫోరెక్స్ పేరుతో కుచ్చుటోపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: అసలు పేరు చెప్పకుండా మారు పేర్లతో ఫోరెక్స్ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించి అమాయక సామాన్యులనేగాక, ఒక డాక్టర్‌కు కూడా కుచ్చుటోపీ పెట్టిన ఘరానా మోసగాడ్ని సెంట్రల్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ స్టేట్ సూరత్‌కు చెందిన అమీర్ అరీఫ్ అగాఢి (23) ఫోరెక్స్ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టితే లాభాల్లో వారానికి 25 శాతం చెల్లిస్తానని పెట్టుబడిదారులను నమ్మించి దాదాపు రెండు కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఫోరెక్స్ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయామని తెలుసుకున్న తిరుమలగిరికి చెందిన డాక్టర్ దినేష్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఆదాయపన్ను నుంచి తప్పించుకోవడానికి ఫోరెక్స్ ట్రేడింగ్ కంపెనీలో హవాలా ద్వారా రెండు కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు కూపీలాగడంతో అసలు విషయం బట్టబయలు అయ్యింది. వివిధ కంపెనీల పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి వాటిని సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేసి బ్యాంక్ అకౌంట్ల మార్చుతూ సొమ్ములను వసూళ్ళు చేశారు. తనతో పాటు వందలాది మంది ఫోరెక్స్ ట్రేడింగ్‌లో మోసపోయారని డాక్టర్ పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు సిసిఎస్ డిప్యూటి కమిషనర్ తెలిపారు.