క్రైమ్/లీగల్

రికార్డులు తీసుకురండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుండి ఆరు నెలల పాటు బషిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను మంగళవారం నాడు సమర్పించాలని హైకోర్టు సోమవారం నాడు హోం శాఖ కార్యదర్శిని ఆదేశించింది. మూడు వేర్వేరు పిటీషన్లను విచారించిన జస్టీస్ ఎ రాజశేఖరరెడ్డి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. మూడు వేర్వేరు పోలీసు కమిషనరేట్లు జూలై 10న , 14న 15న ఇచ్చిన మూడు వేర్వేరు ఉత్తర్వుల్లో పరిపూర్ణానందను బహిష్కరించారని అన్నారు. ప్రాధమిక హక్కులకే భంగం వాటిల్లేలా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని పిటీషనర్ తరఫున హాజరైన డి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. చట్టం ప్రకారం అశాంతి లేకుండా చూసేందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని అదనపు అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు న్యాయస్థానానికి తెలిపారు.
భూ కేటాయింపులపై రేవంత్ పిటిషన్
మైహోం , పిఆర్ ఎనర్జీ సంస్థలకు రాయిదుర్గ పన్మక్త వద్ద ఉన్న 10 ఎకరాల స్థలాన్ని చట్టవిరుద్ధంగా ప్రభుత్వం కేటాయించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎ రేవంత్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దీనిని ప్లాట్లుగా చేసి అమ్మాలని తొలుత నిర్ణయించి, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని బిడ్‌లను ఆహ్వానించిందని, మైహోం , పిఆర్ ఎనర్జీ సంస్థలు బిడ్‌లో పాల్గొన్నా సకాలంలో ఎక్కువ మొత్తానికి భూమిని పాడుకున్నా అవసరమైన మొత్తాన్ని సకాలంలో చెల్లించలేదని, అయినా ప్రభుత్వం ఆ సంస్థలకే భూమిని కేటాయించిందని ఆ పిల్‌లో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.