క్రైమ్/లీగల్

నిషేధం కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: దేశ ప్రజల నిరసన వేదికలైన జంతర్‌మంతర్, బోట్స్ క్లబ్‌ల వద్ద వాటిపై పూర్తిస్థాయి నిషేధం ఎంత మాత్రం తగదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఇక్కడ జరిగే నిరసనలు, ర్యాలీలపై కేంద్రం విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఇలాంటి ప్రదేశాల్లో నిరసనలు, ఆందోళనలపై పూర్తిస్థాయి నిషేధం విధించడం తగదని స్పష్టం చేసింది. తమ సమస్యలు, డిమాండ్లపై శాంతియుతంగా ఆందోళనలు చేసే ప్రాధమిక హక్కు పౌరులకు ఉందని సుప్రీకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. ధర్నాలపై పూర్తిస్థాయి ఆంక్షలను విధించడం తగదని తన తీర్పులో స్పష్టం చేసింది. ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలను అనుమతించే విషయంలో రెండు నెలల్లో మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించింది. ప్రజల నిరసన, శాంతియుత హక్కుల వంటి సంక్లిష్ట అంశాల్లో సమతూకాన్ని సాధించాల్సిన అవసరం ఎంతో ఉందని జస్టిస్ ఎకె సిక్రి, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖానించింది. జంతర్‌మంతర్, బోట్‌క్లబ్‌ల వద్ద ధర్నాలు, ర్యాలీలు జరుగకుండా నిషేధం విధించాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జిటి) వేసిన పిటిషన్‌పై మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్‌తోబాటు ఓ స్వచ్ఛంద సంస్థ సవాలు చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టులో ఈ అంశంపై వాదోపవాదాలు సాగాయి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓట్లకోసం ప్రజల ముంగిటకు వెళుతున్నారు. అలాంటిది ఎన్నికల తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి నేతల కార్యాలయాల వద్దకు రాకూడదనడం ఎంత వరకు సమంజసమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. ఆందోళనకారులను రామ్‌లీలా మైదానం వద్దకు వెళ్లి నిరసన ప్రదర్శనలు చేసుకోవాలని, సెంట్రల్ ఢిల్లీలో ప్రభుత్వ అధికారులు, వీఐపీలు అధికంగా నివసిస్తున్నందున మొత్తం ప్రాంతంపై సెక్షన్ 144సిఆర్‌పిసి ప్రకారం నిషేధాజ్ఞలు విదిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశాధ్యక్షుడు,ప్రధాని తదితరుల దృష్టికి వెళ్లకుండా నిరసన ప్రదర్శనలు చేయడానికి ఎవరు ఇష్టపడతారని ప్రశ్నించారు. అందువల్ల ఆందోళన కార్యక్రమాలు జరిగే సమయాల్లో ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. కాగా బ్యాన్ విధించడానికి గల కారణాలు చూపుతూ గతంలో జంతర్‌మంతర్, బోట్ క్లబ్‌ల వద్ద జరిగిన ఆందోళనలు హింసకు దారితీసిన సుమారు డజను సంఘటనలకు ప్రభుత్వం పేర్కొంది. దీనిని సవాలు చేసిన పిటిషనర్లు ఇలాంటి ఆంక్షలు దీర్ఘకాలం కొనసాగడానికి వీలులేదని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే సమయాల్లో మాత్రమే ఇలాంటి ఆంక్షలు విధించవచ్చని అన్నారు.