క్రైమ్/లీగల్

ఆగస్టు 7 వరకూ అరెస్టు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరానికి తాత్కాలిక ఊరట లభించింది. ఆగస్టు 7 వరకూ ఆయనను అరెస్టు చేయవద్దని సోమవారం పాటియాలా కోర్టు ఆదేశింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ బెయిల్ మంజూరు చేశారు. ఈనెల 19న సీబీఐ దాఖలు చేసిన చార్టిషీట్‌లో చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరం పేర్లు పొందుపరిచారు. సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌కు సంబంధించి ఈనెలాఖరున విచారణ జరగనుంది.
2006లో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డుకు ఆమోదం తెలిపారన్నది ఆరోపణ. ఆర్థిక వ్యవహారలు చూసే కేబినెట్ కమిటీకే ఆ అధికారం ఉన్నపట్టకీ చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఎయిర్‌సెల్-మాక్సిస్ 3,500 కోట్ల రూపాయల ఒప్పందానికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత పాత్రపై సీబీఐ దర్యాప్తు జరిపింది. ఇందులోనే ఐఎన్‌ఎక్స్ మీడియాకు 305 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. కేంద్ర టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్ తదితరులు ఇదే కేసులో నిందితులుగా ఉన్నారు. మారిషస్‌కు చెందిన గ్లోబల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు అనుకూలంగా చిదంబరం వ్యవహించారన్నది ఆరోపణ. మారన్ సోదరుల పేర్లు ఇంతకు ముందే చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అయితే వారిపై చేసిన అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు తీర్పునిస్తూ మారన్ సోదరులకు విముక్తి కల్పించింది.
కార్తీ విదేశాలకు వెళ్తొచ్చు
న్యూఢిల్లీ/ చెన్నై, జూలై 23: కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి న్యాయస్థానాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడ్డాయి. యూకే, ఫ్రాన్స్, అమెరికాలో పర్యటించేందుకు సుప్రీం కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఈనెల 31 వరకూ ఆయన విదేశాల్లో పర్యటించవచ్చని బెంచ్ స్పష్టం చేసింది. వ్యాపారం నిమిత్తం తాను విదేశాల్లో పర్యటించాల్సి ఉందని కార్తీ చిదంబరం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఖన్వీకర్, జస్టిస్ చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం పిటిషన్‌ను విచారించింది.