క్రైమ్/లీగల్

అసలు సమస్యలేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పరివాహక రాష్ట్రాల సమస్యలను త్వరగా నిర్థారించాలని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. వచ్చే విచారణ నాటి సమస్యలను తేల్చలేని పక్షంలో తామే నిర్ణయం తీసుకొంటామని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సమస్యలను గుర్తించి కేంద్రం ద్వారా కోర్టుకి సమర్పించాలని గతంలో ధర్మాసనం ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్ చేస్తూ ఒడిషా ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం జస్టిస్ మదన్ బి.లోకుర్,జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఏపీ తరపు న్యాయవాది ఏ.కే గంగోలి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం మూడు సార్లు సమావేశాలు జరిగిప్పటికీ సమస్యల నిర్థారించేందుకు ఇతర రాష్ట్రాలు సహాకరం అందించడం లేదని ధర్మాసనానికి వివరించారు. దీనికి ఒడిషా,తెలంగాణ తరపు న్యాయవాదులు అభ్యంతారాలు వ్యక్తం చేశారు. అసలు సమస్యలేమిటో గుర్తించడానికి ఎందుకు అలస్యం అవుతోందని, కోర్టుకు ఎందుకు సహాకరం అందించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీ తరపు న్యాయవాది గంగోలి జోక్యం చేసుకోని రాష్ట్రానికి చెందిన ఆరు సమస్యలను గుర్తించినట్టు చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జ్యోక్యం చేసుకోని తదుపరి విచారణ నాటికల్లా ఆయా రాష్ట్రాలు సమస్యలను గుర్తించి కోర్టుకు సమర్పించాలని, లేనిపక్షంలో తామే వాటిని ఖరారు చేయాల్సి ఉంటుందని పేర్కొంటూ తదుపరి విచారణను 30కి వాయిదా వేసింది.