క్రైమ్/లీగల్

స్టే రాకుంటే అనర్హతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: క్రిమినల్ కేసులో దోషిగా తేలిన ప్రజాప్రతినిధికి అప్పీలేట్ కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిన మరుక్షణమే అతడు అనర్హుడవుతాడని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లీల్లీ థామస్ కేసులో 2013న వెలువడిన తీర్పును ‘లోక్ ప్రహారీ’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంలో సవాల్ చేసింది. 2013నాటి కేసులో దోషులుగా నిర్ధారణ అయిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంకా పదవుల్లోనే కొనసాగడాన్ని ప్రస్తావించారు. పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూరి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 2013 జూలై 10న ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4) కింద దోషులైన ప్రజాప్రతినిధులు పదవుల నుంచి తప్పుకోవాలని తీర్పునిచ్చింది. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు మూడు నెలల గడువుఇచ్చింది. కళంకిత ప్రజాప్రతినిధులు ఇంకాపదవులను అంటిబెట్టుకుని ఉండడంతో లోక్‌ప్రహారీ తాజాగా పిటిషన్ వేసింది. ఎన్‌జీవో కార్యదర్శి ఎస్‌ఎన్ శుక్లా ద్వారా కోర్టులో పిటిషన్ వేశారు. దోషులైన ప్రజాప్రతినిధులను తక్షణమే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి. క్రిమినల్ కేసులో దోషులుగా తేలిన అతడు/ఆమెకు న్యాయస్థానంలో స్టే మంజూరు కాని పక్షంలో అప్పటి నుంచే సభ్వత్వానికి అనర్హులవుతారని జస్టిస్ ఖన్వీకర్, జస్టిస్ చంద్రచూడ్‌తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఒక వేళ స్టే వస్చే సభ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని కోర్టు పేర్కొంది. అప్పీలేట్ కోర్టు స్టే ఇవ్వని పక్షంలో అప్పటికప్పుడే వారు అనర్హులవుతారని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా క్రిమినల్ కేసుల్లో స్టే రావడం అన్నది అరుదుగానే జరుగుతుంది.పిటిషనర్ ఫిర్యాదు చేశారు.